Maharaja OTT: OTTకి విజయ్ సేతుపతి మహారాజ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Maharaja OTT: OTTకి విజయ్ సేతుపతి మహారాజ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. రివెంజ్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. కథ పాతదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి నటన వెరసీ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది మహారాజ మూవీ. 

ఇప్పటికే రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ ను దాటేయనుంది. ఇందులో భాగంగానే మహారాజ సినిమాను ఓటీటీ విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట మేకర్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మహారాజ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ జులై 19 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో.. విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన మహారాజ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read:ఇన్స్టా అకౌంట్ క్లోజ్ చేసిన విశ్వక్.. వివాదం తరువాతే ఎందుకు ఇలా?