AndhraKingTaluka: ‘ఆంధ్రకింగ్ తాలూకా’తో.. ‘తెలుగు తెరపై సరికొత్త సంగీతం’.. ఎవరూ ఈ వివేక్ & మెర్విన్?

AndhraKingTaluka: ‘ఆంధ్రకింగ్ తాలూకా’తో.. ‘తెలుగు తెరపై సరికొత్త సంగీతం’.. ఎవరూ ఈ వివేక్ & మెర్విన్?

తమిళంలో ఇరవైకి పైగా సినిమాలకు మ్యూజిక్ చేసిన సంగీత దర్శకులు వివేక్‌‌, మెర్విన్‌‌.. ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళనాట ఇప్పటికే పలు చిత్రాలకు వర్క్ చేసిన వివేక్, మెర్విన్ ‘తెలుగు తెరపై సరికొత్త సంగీత సంచలనానికి నాంది పలికారు’. అది తమ పాటలతో ప్రూవ్ అయింది. ఇవాళ (నవంబర్ 27న) సినిమా రిలీజ్ అయ్యాక.. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో కొత్త సౌండ్ ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. ఈ క్రమంలో వివేక్‌‌, మెర్విన్‌‌ కంపోజ్ చేసిన గత సినిమాల వైపు లుక్కేస్తున్నారు. 

వీళ్లిద్దరి అసలు పేర్లు వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. ‘వడా కర్రీ’ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. ధనుష్ ‘పటాస్’, ప్రభుదేవా ‘గులేబకావళి’, కార్తి ‘సుల్తాన్’ చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. కొత్త ట్యూన్స్తో ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందుగా వివేక్‌‌, మెర్విన్‌‌ ఆసక్తికరమైన పంచుకున్నారు. 

వివేక్‌‌, మెర్విన్‌‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు విడుదలైన నాలుగు పాటలకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మరో మూడు పాటలు ఉన్నాయి. కథలో సందర్భానుసారం వచ్చే పాటలు కనుక ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రతి పాటలోని విజువల్స్‌ స్టన్నింగ్‌‌గా ఉంటాయి. ఇక ఈ సినిమా మొత్తం హీరో రామ్ గారితో చాలా క్లోజ్‌‌గా జర్నీ చేసాం. అలాగే దర్శకుడు మా వెంటే ఉన్నారు. అందరం ఒక రూమ్‌‌లో కూర్చుని కంపోజ్ చేయడం జరిగింది. పాటల్లో సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాం. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాకముందే అన్ని పాటల రికార్డింగ్‌‌ కంప్లీట్ చేశాం.

‘నువ్వుంటే చాలు’ విషయంలో ఓ మంచి పాట చేస్తున్నామని ముందే తెలుసు. రామ్ గారు లిరిక్స్ రాయడం, అనిరుధ్ గారు పాడడంతో తప్పకుండా ప్రేక్షకులకు చాలా నచ్చుతుందని అనుకున్నాం. సాంగ్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

అలాగే ఇలాంటి యూనిక్‌‌ స్టోరీకి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్‌‌‌‌లో కొత్త సౌండ్‌‌ని ప్రయత్నించాం. ఈ సినిమాతో ప్రేక్షకులు ఒక రెట్రో సౌండ్‌‌ని ఫీలవుతారు. దాదాపు ముప్ఫై థీమ్స్‌‌ క్రియేట్ చేశాం. సినిమా రిలీజ్ తర్వాత ఓఎస్టీని రిలీజ్ చేస్తాం” అని వివేక్ మెర్విన్‌‌  చెప్పారు.