స్పోర్ట్స్ డ్రామా మూవీలో కీర్తి సురేష్

స్పోర్ట్స్ డ్రామా మూవీలో కీర్తి సురేష్

ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాల ట్రెండ్ నడుస్తోంది. కీర్తి సురేష్ కూడా ఆ జానర్‌‌‌‌‌‌‌‌ ట్రై చేస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ‘గుడ్‌‌‌‌లక్ సఖి’లో షూటర్‌‌‌‌‌‌‌‌గా కనిపించబోతోందామె. క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కి నూరు శాతం న్యాయం చేసిందని నిన్న విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఓ పల్లెటూరి అమ్మాయి సఖి. ఏం చేసినా రివర్స్ అవుతుంది. అందుకే తనని అందరూ బ్యాడ్‌‌‌‌లక్ సఖి అంటారు. ఆమెలో ఉన్న గొప్ప కళ.. గురి తప్పకుండా షూట్ చేయడం. అది గమనించిన ఓ కోచ్‌‌‌‌ సఖిని ఎంకరేజ్ చేస్తాడు.

ఆడవాళ్లకి షూటింగ్ ఏంటని ఊరివాళ్లంతా వ్యతిరేకిస్తున్నా, కోచ్ సాయంతో సఖి గొప్ప షూటర్‌‌‌‌‌‌‌‌గా ఎలా ఎదిగింది, తన పేరుకు ముందున్న బ్యాడ్‌‌‌‌లక్‌‌‌‌ని గుడ్‌‌‌‌లక్‌‌‌‌గా ఎలా మార్చింది అనేది ఈ మూవీ కథ. కోచ్‌‌‌‌గా జగపతి బాబు పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌గా ఉన్నారు. కీర్తిని ఇష్టపడి ప్రోత్సహించే యువకుడిగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నాడు. కీర్తి ఎదుగుదలకు అడ్డుపడే మరో షూటర్‌‌‌‌‌‌‌‌ పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకుంటున్నాడు. టోటల్‌‌‌‌గా సఖి జర్నీ ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంటుందనిపిస్తోంది. ఈ నెల 28న ఈ మూవీ థియేటర్స్‌‌‌‌లో విడుదలవుతోంది.