
టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్(Sharwanand) ఒకరు. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్ గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మూవీలో హీరోగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (Peoplemediafactory) బ్యానర్ పై వివేక్, విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ 35 ఫిల్మ్ గా రాబోతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా..షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.
రీసెంట్గా శర్వా మరో మూవీని స్టార్ట్ చేసేశాడు. లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి(Abilashreddy) తో తన నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది.
ఇదిలా ఉంటే శర్వా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. శర్వా మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్గా హీరో శ్రీవిష్ణు కు సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు(Ram Abbaraj)తో సినిమా (శర్వా 37) చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ టాక్ ఒకటి బయటకి వచ్చింది. అదేంటంటే..ఈ సినిమాకు బాలయ్య బాబు కెరీర్లోనే సూపర్ హిట్ మూవీగా నిలిచిన నారి నారి నడుమ మురారి టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ టైటిల్ వాడుస్తున్నాడంటే, కథలో చాలా మ్యాజిక్ ఉండాలి. ఎందుకంటే , అప్పట్లో ఆ సినిమాకు ఉన్న క్రేజీ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.
Also Read: మాస్ అవతార్లో మెకానిక్ రాకీ.. విశ్వక్ ఫస్ట్ లుక్ అదిరింది!
అయితే, శర్వా సినిమాలో కూడా ఇద్దరు భామల మధ్యలో హీరో పడే వేదనతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందంట. అందుకే ఈ మూవీకి నారినారి నడుమ మురారి టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
శర్వానంద్ లో చాలా హ్యూమరస్ యాంగిల్ యాక్టింగ్,తనదైన కామెడీ టైమింగ్ ఉంటుంది. అందుకు మంచి ఉదాహరణగా చెప్పాలంటే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన రన్ రాజా రన్ మూవీలో పండిన హిలేరియస్ కామెడీ చూస్తే చాలు తెలిసిపోద్ది.త్వరలో ఈ మూవీ టైటిల్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీకి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్,ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు.ఇపుడు లేటెస్ట్గా రాబోయే మూవీస్ తో అయిన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.
Getting on a hilarious joy ride with @RamAbbaraju and my dear @AnilSunkara1 Garu. A special film!#Sharwa37 - A celebration of love and laughter ❤️ @Composer_Vishal @gnanashekarvs @brahmakadali @aj_sunkara @kishore_Atv @BhanuBogavarapu @NanduSavirigana pic.twitter.com/ZeyGZ7R1dc
— Sharwanand (@ImSharwanand) March 6, 2024