‘లైగర్’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

‘లైగర్’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

ముంబై: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘జనగణమన’ (జేజీఎం) అనే టైటిల్ ను ఖరారు చేశారు. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్, నటి ఛార్మీ కౌర్ కన్ఫర్మ్ చేసింది. పూరి, విజయ్ లు ఈసారి వార్ నేపథ్యంగా సాగే కథతో ప్రేక్షకుల ముందుకొస్తారని.. భారీ స్థాయిలో చిత్రాన్ని రూపొందిస్తామని ఛార్మీ ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 3న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది.

జనగణమన చిత్ర ప్రారంభోత్సవం ముంబైలో జరిగింది. సినిమా ఓపెనింగ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ హెలికాప్టర్ లో రాగా.. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్మీ కమాండో వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్ అన్నారు. ‘జేజీఎం స్క్రిప్ట్ సవాలుతో కూడుకున్నది. కథ చాలా ప్రత్యేకంగా సాగుతుంది. ఇది ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. నా పాత్ర రీఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతకుముందు చేయలేదు. ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. 

మరిన్ని వార్తల కోసం:

‘నాటు నాటు’ పాట పాడిన బాలీవుడ్ సూపర్ స్టార్

మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ

ఇక కరోనా కాలర్ ట్యూన్‌కు గుడ్ బై?