‘అర్జున్‌‌‌‌ రెడ్డి’ఫేమ్ గిరీశాయ డైరెక్షన్లో వైష్ణవ్తేజ్

 ‘అర్జున్‌‌‌‌ రెడ్డి’ఫేమ్ గిరీశాయ డైరెక్షన్లో వైష్ణవ్తేజ్

ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’తో సూపర్ సక్సెస్‌‌‌‌ను అందుకున్న వైష్ణవ్‌‌‌‌ తేజ్, ఆ తర్వాత వచ్చిన ‘కొండ పొలం’తో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. మూడో సినిమాలో పూర్తి స్థాయి లవర్‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌గా కనిపించనున్నాడు. ‘అర్జున్‌‌‌‌ రెడ్డి’ తమిళ రీమేక్‌‌‌‌ని రూపొందించిన గిరీశాయ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కేతికాశర్మ హీరోయిన్‌‌‌‌. ఈ మూవీకి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌‌‌‌ ఖరారు చేసినట్టు అనౌన్స్ చేయడంతో పాటు  టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌ను కూడా నిన్న విడుదల చేశారు.

‘ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావు’ అని వైష్ణవ్ అడుగుతుంటే... ‘ఒక అమ్మాయి ట్రీట్ ఇవ్వాలనుకుంటే తనతో పాటు ఏమీ తీసుకు రానక్కర లేదు’ అని జవాబిచ్చింది కేతిక. ‘బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై కిస్ గురించి తెలుసా’ అంటూ వైష్ణవ్‌‌‌‌కి కేతిక ఓ కిస్ ఇచ్చే సీన్‌‌‌‌తో ఈ టీజర్‌‌‌‌‌‌‌‌ని కట్ చేశారు. ఫస్ట్ టీజర్‌‌‌‌‌‌‌‌లోనే లిప్‌‌‌‌ లాక్‌‌‌‌ సీన్ చూపించడాన్ని బట్టి ఇదో రొమాంటిక్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని అర్థమవుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.