
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం నటి మాధవీలతకి నచ్చలేదట. కాంగ్రెస్ గెలుపుపై సోషల్ మీడియా వేదికగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనియ్యాంశం అయ్యాయి. ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు.
ఇంతకీ మాధవి లత ఏమన్నారంటే.. రానున్న ఐదేళ్ళలో తెలంగాణలో జరగబోయే దారుణాలు ఇవే. ఫుడ్ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, మహిళలకు భద్రత ఉండదు, శాంతి ఉండదు.. తెలంగాణ కాంగ్రెస్ లవర్స్ కి గుడ్ లక్.. ఎంజాయ్ చేయండి. ఇకనుండి రావణ సామ్రాజ్యం మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ కు నా మార్కులు 99.. అంటూ సంచలన పోస్ట్ చేశారీ మాధవి లత. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇక కాంగ్రెస్ మాధవి లత చేసిన వివాదాస్పద కామెంట్స్ పై ఆ పార్టీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలనే కనీస జ్ఞానం కూడా లేదా.. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకో ముందు అంటూ ఫైర్ అవుతున్నారు.