అంతరిక్షంలో పండించిన టమోటాలు భూమి పైకి

అంతరిక్షంలో పండించిన టమోటాలు భూమి పైకి

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో అంతరిక్షంలో పండించిన టమోటాలు ఈరోజు ఏప్రిల్ 15 శనివారం రోజున  స్పేస్‌ఎక్స్ CRS-27, కార్గో రీసప్లై స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమికి తిరిగి వస్తాయని నాసా ప్రకటించింది. అంతరిక్ష నౌక దాదాపు 2,000 కిలోల సామాగ్రి, శాస్త్రీయ ప్రయోగాలను మోస్తుంది. CRS-7 ఉదయం 10:45 (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:15)కి ISS నుండి బయలుదేరుతుంది. 

రెడ్ రాబిన్ అనే మరగుజ్జు రకాలైన చెర్రీ టొమాటోలను ISSలో రెండు వేర్వేరు LED లైట్ కండిషన్స్‌లో వెజ్జీ ఛాంబర్స్ లో పెంచారు. పండ్ల దిగుబడి, పోషక కూర్పు, సూక్ష్మజీవుల స్థాయిలలో గమనించిన తేడాల పరంగా పంట పెరుగుదల విశ్లేషిణ చేశారు. టొమాటో మొక్కలు ఎరువులు ఉన్న వికింగ్ ఉపరితలం సంచులలో పెరిగాయి. వృద్ధికి వ్యవధి 104 రోజులుగా అంచనా వేశారు.