
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిసిన జగన్.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మే 30న CMగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నట్టుగా గవర్నర్ కు జగన్ చెప్పారు.
రాజ్ భవన్ లో భేటీ తర్వాత.. క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత లోటస్ పాండ్ కు వెళ్తారు జగన్.
రేపు ఉ.8.30 గంటలకు ఢిల్లీకి బయల్దేరతారు వైఎస్ జగన్. ఉ.10.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.
రేపు మ.12 గంటలకు ప్రధానమంత్రి మోడీతో జగన్ సమావేశం అవుతారు. వైఎస్ జగన్‌తో పాటు ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఢిల్లీకి వెళ్తున్నారు.