ముంబైకి టమాటా టెన్షన్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

ముంబైకి టమాటా టెన్షన్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

సరఫరా తగ్గడంతో ముంబయిలో టమాటా ధరలు మండి పోతున్నాయి. వాశిలోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్​ మార్కెట్​ కమిటీలో వీటి సరఫరా బాగా తగ్గింది. వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. టమాటా పండే ప్రాంతాల్లో వడగాలుల వల్ల దిగుబడిపై  ప్రభావం పడింది. దీనికి తోడు ప్రధాన సరఫరాదారు రాష్ట్రం అయిన కర్నాటకలో భారీ వర్షాలు పంటల్ని దెబ్బతీశాయి. ఎపీఎంసీ మార్కెట్​లో టమాటా సరఫరా 50 శాతం తగ్గిందని, డిమాండ్​ పెరిగి ధరలు చుక్కలనంటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. 
గత వారం బహిరంగ మార్కెట్లో కిలో రూ.20 వరకు పలికింది. గతంలో హోల్ సేల్ మార్కెట్ లో వీటి ధర కిలో రూ.18–-28 ఉండేది. అయితే జూన్ 22న రూ.28-–50 ధర పలగ్గా.. రిటైల్ గా రూ. కిలో 60 నుంచి రూ.80 వరకు చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో మార్కెట్‌కు 4,050 ట్రక్కుల టమాటాలు వచ్చేవని, కానీ ఉత్పత్తి తగ్గడంతో అవసరమైన సరఫరాలో 50 శాతం మాత్రమే అందుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.