టానిక్ లిక్కర్ మార్ట్ సోదాల్లో సంచలన విషయాలు.. 6 ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల అమ్మకాలు

టానిక్ లిక్కర్ మార్ట్ సోదాల్లో సంచలన విషయాలు.. 6 ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల అమ్మకాలు

హైదరాబాద్: టానిక్ ఎలైట్ వైన్స్ ల సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 6 ఏళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మిగతా10 క్యూబైటానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా జీవో విడుదల చేశాడు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ అడ్రస్ తో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో లైసెన్స్ జారీ చేశాడు. టానిక్ కు ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఎంపీ  ఆధీనంలో ఈ ఎలైట్ వైన్ షాప్ ఉన్నట్లు తెలిస్తోంది. దీంతో భారీ మినహాయింపులతో కూడిన జీవో విడుదల చేసినట్లు సమాచారం. అన్ని వైన్స్​ల్లో మద్యం అమ్మకాలకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటే.. ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్​కు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకూ పర్మిషన్ ఇచ్చారు. విదేశీ మద్యం విషయంలోనూ టానిక్​కు స్పెషల్ పర్మిషన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా అన్ని వైన్స్​లకు టెండర్లు వేస్తే.. ఈ ఎలైట్ వైన్​షాప్​కు మాత్రం ఎలాంటి టెండర్ లేకుండానే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అనుమతించారు. పూర్తి దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామంటామని ఎక్సైజ్ శాఖ,GST అధికారులు తెలిపారు.