టూల్స్ గాడ్జెట్స్ : స్లైసర్‌‌‌‌ హోల్డర్‌‌‌‌

టూల్స్ గాడ్జెట్స్ : స్లైసర్‌‌‌‌ హోల్డర్‌‌‌‌

కొన్ని కూరగాయలను స్లైస్‌‌ల్లా కట్‌‌ చేస్తేనే బాగుంటాయి. కానీ.. అలా కట్‌‌ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ హోల్డర్‌‌‌‌ ఉంటే టొమాటోలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు లాంటివన్నీ స్లైస్‌‌ల్లా ఈజీగా కట్‌‌ చేయొచ్చు. దీన్ని చాలా కంపెనీలు మార్కెట్‌‌లోకి తెచ్చాయి. ఇందులో ఎనిమిది కట్టింగ్ స్లాట్స్‌‌ ఉంటాయి. అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్‌‌తో తయారుచేశారు. హ్యాండిల్ చివర లాకింగ్ డిజైన్‌‌తో వస్తుంది. దీన్ని క్లీన్‌‌ చేయడం కూడా చాలా ఈజీ. 

ధర : కంపెనీని బట్టి 500 రూపాయల నుంచి మొదలు

ఐస్‌ క్రషర్‌‌ 

కొన్ని రకాల ఐస్‌‌క్రీమ్‌‌లతోపాటు చాలా రకాల డిష్‌‌లలో క్రష్‌‌ చేసిన ఐస్‌‌ వాడతారు. అయితే ఐస్​ని క్రష్‌‌ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఈజీగా క్రష్‌‌ చేయడానికి బ్లెండ్ ఆర్ట్‌‌ కంపెనీ ఎలక్ట్రిక్‌‌ ఐస్‌‌ క్రషర్‌‌‌‌ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఈ క్రషర్‌‌‌‌ పవర్‌‌‌‌ఫుల్‌‌ సింగిల్ బ్లేడ్ సిస్టమ్‌‌తో పనిచేస్తుంది. ఇది ఐస్ క్యూబ్‌‌లను క్షణాల్లో పొడిగా మార్చేస్తుంది. దీన్ని హై క్వాలిటీ స్టెయిన్‌‌లెస్ స్టీల్‌‌తో తయారుచేశారు. 

దీన్ని వాడడం కూడా చాలా సులభం. ప్లగ్ ఇన్ చేసి, కంపార్ట్‌‌మెంట్‌‌లో ఐస్ క్యూబ్‌‌లు వేసి, ఆన్‌‌ చేస్తే చాలు. క్లాసిక్ ఐస్ గోలాస్ నుంచి స్లషీస్, స్నో కోన్స్, మిక్స్‌‌డ్ డ్రింక్స్ వరకు అన్నింటికి సరిపోయేలా ఐస్‌‌ని క్రష్‌‌ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్‌‌ చేయడం కూడా ఈజీ. పూర్తిగా కడగాలి అనుకున్నప్పుడు.. ఐస్ హోల్డర్, బ్లేడ్స్​ ఊడదీయొచ్చు. 
 
ధర : 4,700 రూపాయలు

లీఫ్‌‌ రిమూవర్‌‌‌‌

కొత్తిమీర, పుదీనా లాంటి ఆకులను తెంపడానికి చాలా టైం పడుతుంది. కానీ.. ఈ చిన్న టూల్‌‌తో చాలా స్పీడ్‌‌గా ఆకులను వేరు చేయొచ్చు. దీన్ని క్యాలండిస్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. ఈ టూల్‌‌ని ప్రీమియం ఫుడ్‌‌గ్రేడ్‌‌ స్టెయిన్‌‌లెస్ స్టీల్‌‌తో తయారుచేశారు. యాంటీ–రస్ట్, యాంటీ–కొరోజన్ థిక్ మెటల్‌‌తో తయారుచేయడం వల్ల ఈజీగా క్లీన్‌‌ చేసుకోవచ్చు. 

దీనికి ఉండే తొమ్మిది రంధ్రాల ద్వారా తొమ్మిది రకాల హెర్బ్స్‌‌, ఆకుకూరల ఆకులను వేరు చేయొచ్చు. రంధ్రాలు 3 ఎం.ఎం. నుంచి 15 ఎం.ఎం. వరకు వివిధ రకాల సైజుల్లో ఉంటాయి. అంతేకాదు.. దీనికి ఉండే కత్తితో వాటిని కట్‌‌  చేసుకోవచ్చు. కాలే, చార్డ్, కొలార్డ్ గ్రీన్స్, థైమ్, తులసి, రోజ్‌‌మేరీ ఆకులను ఇది ఈజీగా వేరు చేస్తుంది. 

ధర : 787 రూపాయలు 

సీడ్‌‌ రిమూవర్‌‌‌‌

చాలామంది పచ్చిమిర్చిని కూరల్లో వేసుకుని లేదా బజ్జీలు చేసుకుని తినడానికి ఇష్టపడతారు. కానీ.. తినేటప్పుడు వాటి గింజలు నోట్లో అడ్డుతగిలితేనే చిరాకుగా అనిపిస్తుంది. అయితే.. ఆ గింజలను తీసేందుకు కూడా ఒక టూల్‌‌ ఉంది. పలు కంపెనీలు దీన్ని మార్కెట్‌‌లో అమ్ముతున్నాయి. దీన్ని స్టెయిన్​లెస్ స్టీల్‌‌తో తయారుచేస్తున్నారు. దీని అంచులో ఉండే ట్విస్ట్, లోపలి పళ్ళతో కోర్, విత్తనాలను సులభంగా తొలగిస్తుంది. మిరియాలు, పెద్ద సైజు మిర్చిల్లోని విత్తనాలను తీయడానికి ఇది బెస్ట్‌‌ ఛాయిస్‌‌. వీటితోపాటు దోసకాయలు, చిన్న వంకాయలు, గుమ్మడికాయ, యాపిల్ లాంటి వాటిలో గింజలు తీయడానికి కూడా దీన్ని వాడొచ్చు. 

ధర : 199 రూపాయలు