టూల్స్ ఆండ్ గాడ్జెట్స్ : స్టీరింగ్ వీల్‌‌

టూల్స్ ఆండ్ గాడ్జెట్స్ : స్టీరింగ్ వీల్‌‌

స్టీరింగ్ వీల్‌‌ 

ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్లకు భుజాల నొప్పి రావడం సర్వ సాధారణం. ఎక్కువసార్లు స్టీరింగ్‌‌ తిప్పడమే భుజం నొప్పికి కారణం. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీల్‌‌ని స్టీరింగ్‌‌కి ఇన్‌‌స్టాల్‌‌ చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. దీన్ని ‘ఇంప్రోనౌ’ అనే కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. దీన్ని స్టీరింగ్​కు పెట్టుకుంటే స్టీరింగ్‌‌ తిప్పేటప్పుడు భుజాల మీద ఒత్తిడి పడదు. అన్ని రకాల వెహికల్స్‌‌కి సరిపడుతుంది. కార్ల నుంచి పెద్ద ట్రక్కుల వరకు అన్నింటికీ వాడొచ్చు.

ఈ వీల్‌‌ 360 డిగ్రీల వరకు తిరుగుతుంది. అందువల్ల రొటేషన్ స్మూత్​గా ఉంటుంది. హ్యాండిల్‌‌ కంట్రోల్‌‌ చేయడం చాలా ఈజీ. ముఖ్యంగా మలుపుల దగ్గర డ్రైవర్‌‌‌‌ ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు. ఈ వీల్‌‌కి హై-స్ట్రెంత్ మెటల్ బాల్ బేరింగ్ ఉంటుంది. చాలాకాలం వరకు పాడుకాదు. స్టీరింగ్​కి పెట్టుకునే ఈ వీల్‌‌ని ఇన్‌‌స్టాల్‌‌ చేయడం కూడా చాలా ఈజీ.
ధర : 300 రూపాయలు 

  ఇన్వర్టర్‌‌‌‌ 

కారులో ఏదైనా డివైజ్‌‌ ఛార్జింగ్‌‌ పెట్టుకోవాలంటే.. డీసీ ఛార్జర్‌‌‌‌ వాడుతుంటారు. కానీ.. దాంతో ఎలక్ట్రిక్‌‌ కెటిల్‌‌, ఎయిర్ డ్రయ్యర్‌‌‌‌ లాంటి చిన్న చిన్న గాడ్జెట్స్‌‌ వాడలేం. అందుకే కార్లలో ఇలాంటి డీసీ టు ఏసీ ఇన్వర్టర్‌‌‌‌ని పెట్టుకోవాలి. దీన్ని సెప్టిక్స్‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. ఇది పవర్ ఇన్వర్టర్‌‌‌‌లా మాత్రమే కాదు.. ఛార్జర్‌‌‌‌గా కూడా పనిచేస్తుంది. దీన్ని ప్రీమియం మెటీరియల్‌‌తో తయారు చేశారు. ఇది ఫైర్‌‌‌‌ ఫ్రూఫ్. 12V  డీసీ పవర్‌‌‌‌ని తీసుకుని 220 V ఏసీ పవర్‌‌‌‌ని ఇస్తుంది.

దీనికి రెండు ఏసీ అవుట్‌‌పుట్‌‌ సాకెట్లు ఉన్నాయి. ల్యాప్‌‌టాప్, గేమ్ కన్సోల్, టీవీ, డీవీడీ ప్లేయర్‌‌‌‌కు కూడా పవర్ సప్లై చేయొచ్చు. నాలుగు యూఎస్‌‌బీ ఛార్జింగ్ పోర్ట్‌‌లు ఉన్నాయి. వీటితో ఐపాడ్, స్మార్ట్‌‌ఫోన్‌‌లాంటి  ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌‌లను స్పీడ్‌‌గా ఛార్జ్‌‌ చేసుకోవచ్చు. ఇందులో కూలింగ్ ఫ్యాన్‌‌ కూడా ఉంటుంది. అందువల్ల వేడెక్కడం, ఓవర్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ లాంటి సమస్యలు తలెత్తవు. దీనికి ఒక డిజిటల్‌‌ డిస్‌‌ప్లే కూడా ఉంటుంది. అందులో వోల్టేజ్‌‌ను చూపిస్తుంది. ఎలక్ట్రిక్ పరికరాలను ఛార్జ్ చేస్తున్నప్పుడు యూఎస్‌‌బీ పోర్ట్‌‌ల కరెంట్‌‌ చూపిస్తుంది. ఏసీ, యూఎస్‌‌బీ ద్వారా ఒకేసారి ఆరు డివైజ్‌‌లకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీని సైజు కేవలం 24 అంగుళాలు మాత్రమే. కాబట్టి కారులో ఎక్కువ స్పేస్‌‌ కూడా తీసుకోదు. 
ధర : 2,099 రూపాయలు

క్లీనింగ్ జెల్‌‌‌‌‌‌ 

పిల్లలు కారెక్కితే.. ఏదో ఒకటి తిని వేస్ట్‌‌ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ఆ చెత్త కాస్తా కారు లోపల మూలల్లో, సందుల్లో చేరిపోతుంది. ఇలాంటి చెత్త, దుమ్ముని క్లీన్‌‌ చేయాలంటే కొంచెం కష్టమే. అలాంటప్పుడు ఈ క్లీనింగ్‌‌ జెల్‌‌ వాడాలి. మూలమూలల్లో దాక్కున్న చెత్తని అతికించుకుని బయటికి తెస్తుంది ఈ జెల్​. ముఖ్యంగా వెంట్స్, కప్ హోల్డర్లు, ఇంటీరియర్‌‌, డాష్‌‌బోర్డ్‌‌ సందుల్లో చాలా బాగా క్లీన్‌‌ చేస్తుంది. వోల్పిన్  కంపెనీ తయారుచేసిన ఈ జెల్​తో కంప్యూటర్​ కీబోర్డ్‌‌లు కూడా క్లీన్‌‌ చేయొచ్చు. టైపింగ్​ చేసే కీస్​ మధ్య నుండి దుమ్ము, ధూళిని శుభ్రంగా తీసేస్తుంది. చూయింగ్​ గమ్​లా ఉండే ఈ జెల్​కి చెత్తాచెదారం ఈజీగా అతుక్కుంటుంది. క్లీనింగ్ జెల్​ను ఎన్నిసార్లయినా వాడొచ్చు. ఎన్విరాన్‌‌మెంట్‌‌ ఫ్రెండ్లీ, నాన్-టాక్సిక్ మెటీరియల్‌‌తో ఈ జెల్​ తయారు చేస్తారు. 
ధర : 159 రూపాయలు 

స్లిప్‌‌ కాకుండా.. 

కారు ఎక్కడం, దిగడం అలవాటు ఉన్నవాళ్లు కూడా ఒక్కోసారి కంగారుగా దిగుతూ  స్లిప్​ అయ్యి కింద పడిపోతారు. ముఖ్యంగా ఎత్తు ఎక్కువగా ఉండే పెద్ద కార్లలో ఈ సమస్య వస్తుంది. అలాంటి కార్లకు చాలామంది బంపర్లు పెట్టిస్తుంటారు. అది చాలా సాఫ్ట్‌‌గా ఉండి కాలు పెట్టగానే జారిపోతుంది. బంపర్‌‌‌‌ లేని కార్లలో ఫూటర్‌‌‌‌ స్మూత్‌‌గా ఉండడం వల్ల కూడా కాలు స్లిప్​ అవుతుంది. అందుకే కాలు పెట్టే చోట ఈ కార్బన్ ఫైబర్‌‌‌‌ షీట్‌‌ అతికించాలి. ఆటోమోటివ్ గ్రేడ్ ప్రీమియం హై క్వాలిటీ మెటీరియల్‌‌తో దీన్ని తయారుచేస్తారు. దీన్ని డీజీఎస్‌‌ఎల్‌‌ అనే కంపెనీ అమ్ముతోంది. కారు హుడ్, ట్రంక్, రూఫ్, డాష్‌‌బోర్డ్, ఇంటీరియర్‌‌‌‌కు బాగా సరిపోతుంది. దీన్ని ఇన్‌‌స్టాల్‌‌ చేయడం కూడా చాలా ఈజీ. స్టిక్కర్‌‌‌‌లా అతికిస్తే చాలు.  వాటర్ ప్రూఫ్​ కాబట్టి ఎన్నిసార్లైనా నీళ్లతో కడగొచ్చు. ఇది పలు రకాల సైజ్​ల్లో దొరుకుతుంది.

33 ఫీట్లు పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉన్న షీట్‌‌ ధర :  250 రూపాయలు