టూల్స్ గాడ్జెట్స్ : కాల్ రికార్డర్‌‌

టూల్స్ గాడ్జెట్స్ : కాల్ రికార్డర్‌‌

కాల్ రికార్డర్‌‌

చాలా కంపెనీల ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. కానీ.. ఐఫోన్‌‌‌‌ కాల్‌‌ రికార్డింగ్ చేయడం కష్టం. ఇందులో థర్ట్‌‌ పార్టీ కాల్‌‌ రికార్డింగ్ యాప్స్ పని చేయవు. కానీ.. కొందరికి ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం కాల్స్ రికార్డ్‌‌ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకు ఈ గాడ్జెట్‌‌ బెస్ట్ ఛాయిస్‌‌. దీన్ని మ్యాగ్మో అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. ఈ గాడ్జెట్​ను ఐఫోన్‌‌ వెనక భాగంలో ఎటాచ్‌‌ చేస్తే చాలు.  వాయిస్‌‌ కాల్స్‌‌ని రికార్డ్ చేస్తుంది. దీనికి ఆన్​/ఆఫ్​ బటన్‌‌ కూడా ఒకటి ఉంటుంది. కాల్‌‌ రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు స్విచ్‌‌ని పైకి తిప్పాలి.

ధర : 5,999 రూపాయలు 

మల్టీ -ఫంక్షనల్ మినీ ఫ్లాష్‌లైట్

ఈ గాడ్జెట్‌‌‌‌‌‌ చూడడానికి చిన్న కీచైన్‌‌‌‌లా ఉంటుంది. కానీ.. చాలా పనులు చేస్తుంది. క్లిఫ్ఫో అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ఇందులో రెండు రకాల స్క్రూ డ్రైవర్లు, ఒక ఇగ్నైటర్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఇది పోర్టబుల్ కీచైన్, రోప్ కట్టర్, బాటిల్ ఓపెనర్, రెంచ్, విజిల్‌‌‌‌లా కూడా పనిచేస్తుంది. ఫిషింగ్, వాకింగ్, క్యాంపింగ్ చేసేటప్పుడు ఇది తోడుంటే చాలా ఉపయోగం. దీనికి హై కెపాసిటీ బ్రైట్ లైట్‌‌‌‌ కూడా ఉంటుంది. కుంభాకార లెన్స్‌‌‌‌ ఉండడం వల్ల వెలుగు బాగుంటుంది. 800ల్యూమెన్స్ కంటే ఎక్కువ లైట్‌‌‌‌ రిలీజ్ చేస్తుంది. అంతేకాదు.. ఇందులో ఏడు లైట్ మోడ్‌‌‌‌లు ఉన్నాయి. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో రెండేసి అడ్జెస్ట్‌‌‌‌మెంట్లు ఉంటాయి.

వీటితోపాటు మరో సూపర్ స్ట్రాంగ్ లైట్ బటన్‌‌‌‌ ఉంటుంది. అవుట్‌‌‌‌డోర్‌‌‌‌లో ఉన్నప్పుడు ఈ లైట్‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మ్యాగ్నెట్‌‌‌‌ డిజైన్‌‌‌‌తో తయారుచేశారు. కాబట్టి ఎక్కడైనా అతికించుకోవచ్చు. అంతేకాదు.. దీనికి వెనుకభాగంలో చిన్న లైటర్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సిగరెట్స్​ వెలిగించేందుకు డిజైన్ చేసిన దీన్ని అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్‌‌‌‌తో తయారు చేశారు. ఇది వాటర్‌‌‌‌‌‌‌‌, రస్ట్ రెసిస్టెంట్‌‌‌‌. ఇందులో 500mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌‌‌‌బీ పవర్ సోర్స్‌‌‌‌ ద్వారా టైప్‌‌‌‌ సీతో ఛార్జ్ చేసుకోవచ్చు.  

ధర : 630 రూపాయలు

ఎయిర్ డస్టర్‌‌

ఎక్కువగా వాడని గాడ్జెట్లు, వస్తువుల మీద విపరీతంగా దుమ్ము పేరుకుపోతుంటుంది. ఆ దుమ్ముని తడిబట్ట పెట్టి తుడవలేము. అలాగని వదిలేయలేం. ఈ దుమ్ముని క్లీన్‌‌‌‌‌‌ చేయడానికి పోర్టబుల్‌‌‌‌ కంప్రెస్డ్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌ డస్టర్‌‌‌‌‌‌‌‌ వాడాలి. దీన్ని ఒటావో కంపెనీ తీసుకొచ్చింది. ఇది ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులు, కిటికీలు, సోఫాల సందుల్లో దుమ్ముని ఈజీగా క్లీన్‌‌‌‌ చేస్తుంది. కడిగిన వస్తువుల పైన ఉండే నీటి చుక్కల్ని కూడా తొలగిస్తుంది. ఇందులో మూడు స్పీడ్‌‌‌‌ అడ్జెస్ట్‌‌‌‌మెంట్స్ ఉంటాయి. కనిష్టంగా 33,000 ఆర్పీఎం, గరిష్టంగా 51,000 ఆర్పీఎంతో మోటార్‌‌‌‌‌‌‌‌ తిరుగుతుంది.

డివైజ్‌‌‌‌ని ఆన్/ఆఫ్ చేయడానికి బటన్‌‌‌‌ను మూడు సెకన్లు నొక్కి పట్టుకోవాలి. ఇది కాంపాక్ట్‌‌‌‌ సైజులో ఉన్నా.. దీన్నుంచి వచ్చే గాలితో 99శాతం దుమ్ము ఎగిరిపోతుంది. దీంతోపాటు ప్యాక్‌‌‌‌లో ఐదు నాజిల్స్‌‌‌‌ వస్తాయి. ఇది కార్డ్‌‌‌‌ లెస్‌‌‌‌ ఎయిర్ డస్టర్‌‌‌‌‌‌‌‌. ఇందులో 6000mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్‌‌‌‌ ఛార్జ్‌‌‌‌ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది. ఒకసారి ఫుల్‌‌‌‌ ఛార్జ్ చేస్తే అరగంట పనిచేస్తుంది. 

ధర : 6,399 రూపాయలు 

వాషర్ గన్‌

ఇంట్లో ఎన్ని నీళ్లున్నా కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బైక్‌‌‌‌లు కడగడం కొంచెం కష్టమే. ఎందుకంటే.. నల్లా నీళ్లు అంత ప్రెజర్‌‌‌‌‌‌‌‌తో రావు. కానీ.. నల్లాకు ఈ గాడ్జెట్‌‌‌‌ని కనెక్ట్‌‌‌‌ చేస్తే మాత్రం చాలా ప్రెజర్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేస్తుంది. కాంపాక్ట్‌‌‌‌ సైజులో ఉండే ఈ రీఛార్జబుల్‌‌‌‌ వాషర్‌‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌ని షాపోబాక్స్‌‌‌‌ కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది. ఈ ప్రెజర్ వాషర్‌‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌తో  మోటారు బైక్స్‌‌‌‌, కార్లు ఇంజనీరింగ్ వెహికల్స్‌‌‌‌, మెషిన్స్‌‌‌‌, వ్యవసాయ యంత్రాలు, బిల్డింగ్‌‌‌‌ల గోడలు, స్విమ్మింగ్ పూల్స్, తలుపులు, కిటికీలు క్లీన్‌‌‌‌ చేసుకోవచ్చు.

తక్కువగా వాడేవాళ్లు అయితే.. నెలకు ఒకసారి ఛార్జ్‌‌‌‌ చేస్తే చాలు. దీని బరువు కూడా చాలా తక్కువ.  వాషర్‌‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌తో పాటు స్టీల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ రాడ్‌‌‌‌, వాటర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌లెట్‌‌‌‌ ఫిల్టర్‌‌‌‌‌‌‌‌, రెండు వాటర్ ఔట్‌‌‌‌లెట్స్‌‌‌‌, ఇన్‌‌‌‌లెట్‌‌‌‌ పైప్‌‌‌‌, బ్యాటరీ, ఛార్జర్‌‌‌‌‌‌‌‌ వస్తాయి. ఇన్‌‌‌‌స్టలేషన్‌‌‌‌ కూడా చాలా ఈజీ. 

ధర : 3,199 రూపాయలు