2023 Cinema Rewind: ఈఏడాది గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్

2023 Cinema Rewind: ఈఏడాది గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్

మరో 20 రోజుల్లో 2023 ముగిసిపోయి కొత్త సంవత్సరం మొదలుకాబోతోంది. దీంతో 2024కు స్వాగతం పలుకుతూ.. 2023లో గడిపిన ఆనందమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. అందులో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే అంశం ఏదైనా ఉందంటే అది సినిమా అనే చెప్పాలి. ఇక సినిమాల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ముందుగా వెతికేది గూగుల్ లోనే కాదా. అందుకే.. ఈ సంవత్సరం భారతీయులు అత్యధిక వెతికిన టాప్‌-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది గూగుల్. మరి ఆ సినిమాలేంటి? వాటి రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.   

2023లో భారతీయులకు ఎక్కువగా గూగుల్ చేసిన సినిమాల్లో మొదటి స్థానంలో బాలీవుడ్ బాద్షా హీరోగా వచ్చిన జవాన్ నిలిచింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

రెండు స్థానంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 నిలిచింది. గదర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. దేశభక్తి బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

ఇక మూడవ స్థానంలో హాలీవుడ్ ఓపన్ హీమార్ నిలిచింది. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. 

నాల్గవ స్థానాల్లో ప్రభాస్ రాముడిగా చేసిన ఆదిపురుష్ నిలిచింది. రామాయణ గాద ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా విమర్శలు కూడా తలెత్తాయి. 

ఐదవ స్థానాల్లో షారుఖ్ నటించిన పఠాన్ నిలిచింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్  తెరకెక్కించిన  ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ఆరవ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్ర తెరకెక్కించిన ది కేరళ స్ట్రీ నిలిచింది. కేరళలో కనబడకుండా పోయిన 3000 మంది హిందూ అమ్మాయిల కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అదా శర్మ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాపై తీవ్ర ఆందోళనలు జరిగాయి.         

ఏడవ స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ నిలిచింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రజినికి జైలర్ తో భారీ హిట్టు పడింది. దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. 

ఎనిమిదవ స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో నిలిచింది. యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరెకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

తొమ్మిదవ స్థానంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన స్పై థ్రిల్లర్ టైగర్ 3 నిలిచింది. స్టైలీష్ యాక్షన్ చిత్రాల దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

ఇక పదవ స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు నిలిచింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2023 సంక్రాంతికి రిలీజై రూ.260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.