మాన్‌‌‌‌సూన్ ఆఫర్లను ప్రకటించిన గో ఫస్ట్‌‌, ఎయిర్‌‌‌‌ఏషియా

మాన్‌‌‌‌సూన్ ఆఫర్లను ప్రకటించిన గో ఫస్ట్‌‌, ఎయిర్‌‌‌‌ఏషియా
  • మాన్‌‌‌‌సూన్ ఆఫర్లను ప్రకటించిన గో ఫస్ట్‌‌, ఎయిర్‌‌‌‌ఏషియా
  • ఇప్పటికే ఇటువంటి సేల్‌ను పూర్తి చేసిన విస్తారా
  • భవిష్యత్‌‌లో ఇండిగో, స్పైస్‌‌జెట్‌‌, ఎయిర్‌‌‌‌ఇండియాలు కూడా ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: దేశంలోని టాప్ ఎయిర్‌‌‌‌‌‌లైన్ కంపెనీలు మాన్‌‌సూన్ (వర్షాకాలం) సేల్స్‌‌ను స్టార్ట్ చేశాయి. ఇప్పటికే ‘ఎర్లీ మాన్‌‌సూన్ సేల్స్‌‌’ కింద వన్‌‌–వే (డొమెస్టిక్‌‌)టికెట్‌‌ను  రూ. 1,699 కే విస్తారా అమ్మింది. తాజాగా గో ఫస్ట్‌‌, ఎయిర్‌‌‌‌ఏషియాలు కూడా ‘మాన్‌‌సూన్ సేల్స్‌‌’ను,  ‘స్ప్లాష్ సేల్‌‌’ను ప్రకటించాయి. డొమెస్టిక్ ట్రావెల్స్‌‌ కోసం విమాన టికెట్ రేటును రూ. 1,499 నుంచి  గో ఫస్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ ధరలోనే ట్యాక్స్‌‌లు కూడా కలిసి ఉంటాయి. ఈ నెల 7  నుంచి 10  మధ్య టికెట్స్‌‌ బుక్ చేసుకున్న వాళ్లకు ఈ స్పెషల్ ఆఫర్‌‌‌‌ను కంపెనీ అందిస్తోంది.  జులై 26, 2022 నుంచి మార్చి 31, 2023  మధ్య ట్రావెల్ చేయడానికి చేసుకున్న బుకింగ్స్‌‌పై మాత్రమే ఈ మాన్‌‌సూన్ ఆఫర్‌‌‌‌ వర్తిస్తుంది. కస్టమర్లు తమ ట్రావెల్‌‌ ప్లాన్‌‌లను ముందుగానే చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ మాన్‌‌సూన్ ఆఫర్‌‌‌‌ను తీసుకొచ్చామని గో ఫస్ట్ వివరించింది. గో ఫస్ట్‌‌ వెబ్‌‌సైట్‌‌, మొబైల్‌‌ యాప్‌‌, ఎయిర్‌‌‌‌పోర్ట్ కియోస్క్‌‌లు, కాల్ సెంటర్లు, ట్రావెల్‌‌ ఏజెంట్లు, ఆన్‌‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్ కింద టికెట్స్ బుక్‌‌ చేసుకోవచ్చు. 

ఎయిర్‌‌‌‌ఏషియా స్ప్లాష్‌‌ సేల్‌‌..

డొమెస్టిక్‌‌ ట్రావెల్స్ చేసే వారి కోసం ఎయిర్‌‌‌‌ఏషియా కూడా  స్ప్లాష్ సేల్‌‌ను  ప్రకటించింది. లోకల్ రూట్ల కోసం టికెట్లను రూ. 1,497 నుంచే బుక్ చేసుకోవడానికి అవకాశం కలిపించింది. ఈ నెల 10 లోపు చేసుకున్న టికెట్‌‌ బుకింగ్స్‌‌కే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కస్టమర్లు ఈ నెల 26 నుంచి మార్చి 31, 2023 మధ్య ట్రావెల్‌‌ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉండి స్ప్లాష్‌‌ సేల్‌‌ కింద కేటాయించిన సీట్లు బుక్‌‌ అయిపోతే, మిగిలిన సీట్లకు సాధారణ రేట్లే వర్తిస్తాయని ఈ టాటా గ్రూప్‌‌ కంపెనీ ప్రకటించింది. గో ఫస్ట్‌‌ మాదిరే ఎయిర్‌‌‌‌ఏషియా స్ప్లాష్ సేల్‌‌ కోసం కూడా వివిధ మార్గాల్లో టికెట్స్‌‌ను బుక్‌‌ చేసుకోవచ్చు. మరోవైపు విస్తారా వన్‌‌–వే (ఒకవైపు) డొమెస్టిక్ ట్రావెల్‌‌ టికెట్‌‌ను రూ. 1,699 కే ఆఫర్ చేసింది. ఇంటర్నేషనల్‌‌ రిటర్న్‌‌ టికెట్ రేట్లను రూ. 14,249 కే ఆఫర్ చేసింది. ఎర్లీ మాన్‌‌సూన్ సేల్‌‌ కింద కిందటి నెల 2 నుంచి 5 మధ్య ఈ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. భవిష్యత్‌‌లో ఇండిగో, స్పైస్‌‌జెట్‌‌, ఎయిర్‌‌‌‌ఇండియాలు కూడా మాన్‌‌సూన్ ఆఫర్లను ప్రకటించే 
అవకాశం ఉంది.