ఎస్‌‌బీఐకి అప్పులెగ్గొట్టిన టాప్ కంపెనీలు

ఎస్‌‌బీఐకి అప్పులెగ్గొట్టిన టాప్ కంపెనీలు

మాకు అప్పులు ఎగ్గొట్టాయ్‌‌.. 

కంపెనీల పేర్లు బయటపెట్టిన స్టేట్‌‌బ్యాంక్‌‌

ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌‌బీఐ డబ్బులుండి కూడా ఉద్దేశపూర్వకంగా అప్పులు ఎగ్గొట్టే వారిపై కొరడా ఝుళిపిస్తోంది. ఈ ఏడాది 24 మందికి పైగా కార్పొరేట్ బారోవర్స్‌‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ బ్యాంక్‌‌ కార్పొరేట్ రంగానికి ఎక్కువగా అప్పులిస్తూ ఉంటోంది. ఈ బారోవర్స్ వద్ద మనీ ఉన్నప్పటికీ, తిరిగి అప్పులను చెల్లించడం లేదని బ్యాంక్ గుర్తించింది. అప్పు తీసుకున్న దానికి కాకుండా.. ఇతర వాటికి ఫండ్స్‌‌ను తరలిస్తున్నారని తెలిపింది. ఈ మనీ రికవరీ కోసం పలు కోర్టుల్లో కూడా బ్యాంక్‌‌ ఫిర్యాదు దాఖలు చేసింది. కానీ ఈ ఫిర్యాదులు ఇంకా కోర్టుల్లోనే నలుగుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి విజయ్‌‌ మాల్యాకు చెందిన కింగ్‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌లైన్స్, గీతాంజలి జెమ్స్‌‌కు చెందిన మెహుల్ చోక్సి ఉన్నారు. 2018–19లో ఎస్‌‌బీఐ 163 కేసులను ఉద్దేశపూర్వక ఎగవేత కేసులుగా రిపోర్ట్ చేసింది. అవి రూ.13,718 కోట్ల మొత్తాన్ని దారి మళ్లించినట్టు తెలిపింది. 2014–15లో ప్రారంభమైన ప్రస్తుత ఎన్‌‌పీఏ సైకిల్‌‌లో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు భారీగా పెరిగారని పేర్కొంది. ఈ ఎగవేతల నుంచి బ్యాంక్‌‌లను కాపాడేందుకు ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్రాంక్‌‌రప్టస్సీ కోడ్‌‌ను కూడా ఆర్‌‌‌‌బీఐ తీసుకొచ్చింది. ఈ కోడ్ కింద పలు కంపెనీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని బ్యాంక్‌‌లు కోరుతున్నాయి. ఆర్‌‌‌‌బీఐ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 30 మంది మేజర్‌‌‌‌ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను ప్రకటించింది. ఎస్‌‌బీఐ టాప్ డిఫాల్టర్స్‌‌లోని కింగ్‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌లైన్స్, రుచి సోయా, ఆర్‌‌‌‌ఈఐ ఆగ్రో కంపెనీలు ఆర్‌‌‌‌బీఐ టాప్ 30 లిస్ట్‌‌లో ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల మొత్తం రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లకు పెరిగినట్టు సిబిల్ పేర్కొంది.

టాప్ 10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు…

ఏబీజీ షిప్‌‌యార్డ్

    రుచి సోయా

    కోస్టల్‌‌ ప్రాజెక్ట్స్

    కింగ్‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌లైన్స్

    కేఎస్ ఆయిల్

    ఏఆర్‌‌‌‌ఎస్ఎస్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్

    బీఎస్ లిమిటెడ్

    ఆర్‌‌‌‌ఈఐ ఆగ్రో 

    సూర్య ఫార్మాస్యూటికల్స్

    యాక్షన్ ఇస్పాత్‌‌ అండ్ పవర్ లిమిటెడ్