మీరు ఈ 5 కోర్సులు చదివి ఉంటే.. ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది..!

మీరు ఈ 5 కోర్సులు చదివి ఉంటే.. ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది..!

ఈమధ్యకాలంలో టెక్నాలజీ అన్నీ రంగాల్లో అడుగుపెట్టే సరికీ ఉపాధి కల్పన కరువైతుంది. విద్యార్థుల్లో చాలా గంధరగోళం మొదలైంది. ఇప్పుడే కెరీర్ డెసీషన్ తీసుకునే స్టూడెట్స్ పెద్ద పెద్ద కంపెనీల లే ఆఫ్ వార్తలు విని భయంపడుతున్నారు. ఏ ఫీల్డ్ లో మంచి కెరీర్ ఉంటుంది. ఏ చదివితే జీవితంతో మంచి జాబ్ కొట్టి.. సెట్టిల్ కావచ్చని తపన పడుతున్నారు. విద్యారంగంలో కొంతమంది విద్యావేత్తలు చేసిన రీసెర్చ్ ప్రకారం కొన్ని మెడ్రనేటెడ్ కోర్సులు చదివిన వారికి మాత్రమే జాబ్ సంపాధించడంలో ఏ ప్రాబ్లమ్స్ రావడం లేదట.

టెక్నాలజీ పెరిగినా మానవ శ్రమ అవసరమున్న కొన్ని రంగాలు ఉన్నాయి. అలాంటి  కోర్సులపై దృష్టి పెడితే విద్యార్థులు చదివిన చదువుకు ఉద్యోగం దొరుకుద్దా, లేదా అనే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఈ కోర్సులు చదివిన వారు మంచి ఉపాది అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. 

ఈ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ

మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: చదివిన వారు 71శాతం ఉపాది పొందుతున్నారు
కంప్యూటర్ సైన్స్: కోర్సులు చేసిన వారు వారికి కావాల్సిన ప్యాకేజీతో 68 శాతం జాబ్స్ సాధింస్తున్నారు.
ఇంజనీరింగ్: చదివిన వారు 65 శాతం ఉద్యోగాల్లో సెట్టిల్ అవుతున్నారు.
మెడిసిన్: వైద్య వృత్తి విద్య అభ్యసించిన వారు 63 శాతం జాబ్ పొందడంలో సక్సెస్ రేటుతో ఉన్నారు. వీరిలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారు.
లా: న్యాయ విద్యలో కోర్సులు చదివిన  మొత్తం మందిలో 60 శాతం న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా కెరీర్ లో విజయాన్ని సాధిస్తు్నారు.