Trisha Remuneration:నలభై ఏళ్ల వయసులోను త్రిష కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

Trisha Remuneration:నలభై ఏళ్ల వయసులోను త్రిష కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

సౌత్లో సీనియర్​ బ్యూటీల హవా తగ్గుతున్న వేళ త్రిష (Trisha) మాత్రం తన దూకుడు చూపిస్తోంది. కుర్ర హీరోయన్లకు సైతం పోటినిచ్చేలా తనను తాను మలుచుకుని బడా ఆఫర్లు కొట్టేస్తోంది. 

వయసు పెరుగుతున్నా కొద్దీ త్రిషలో అందం రెట్టింపు అవుతోంది. గ్లామర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా..నేటి తరం యువ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ అమ్మడి లుక్స్ పీక్స్ లో ఉంటున్నాయి. లియో,పొన్నియన్ మూవీస్ హిట్స్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది త్రిష. అంతేకాకుండా ప్రస్తుతం త్రిష వరుస అవకాశాలతో అదరగొట్టేస్తుంది. 

స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ విదా మూయుర్చిలో నటిస్తుంది. అలాగే కమల్..మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ చిత్రంతో పాటు..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రామ్, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఇలా పలు మూవీస్ లో నటిస్తుంది. 

అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష  థగ్ లైఫ్ కోసం కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుంని స‌మాచారం. భారీ బడ్జెట్ తో తెరక్కేబోయే ఈ సినిమాకు గాను రూ.12 కోట్ల తీసుకుంటుందిట‌. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న ఏ యంగ్ హీరోయిన్ సైతం ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకోట్లేదు. ఆంటే ఇదొక ట్రేండింగ్ రికార్డ్ అని చెప్పుకోవాలి. 

మరి ఇంత రెమ్యునరేషన్ ఎందుకా అని డౌట్ వస్తే మాత్రం..త్రిష ప్రస్తుత లుక్స్ ఆడియన్స్ని అంతలా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పొచ్చు. ఇలాంటి అందాల భామని తీసుకోవాలంటే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనట.