
మేఘాలయ: రాష్ట్రంలని షాన్ బంగ్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాప్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీన్ దయాళన్ మృతి చెందాడు. రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ లో ‘83వ సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్’ నేడు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల విశ్వ దీన్ దయాళన్ మరో ముగ్గురు ఆటగాళ్లతో గువాహటి నుంచి షిల్లాంగ్ కు ఆదివారం సాయంత్రం ఓ కారులో బయలు దేరాడు. ఈ నేపథ్యంలోనే షాన్ బంగ్లా సమీపంలోకి రాగానే వారి కారును ఎన్‌హెచ్ 6 పై షాన్ బంగ్లా వద్ద ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. విశ్వతో పాటు అతని సహచర ఆటగాళ్లు రమేష్ సంతోష్ కుమార్, అవినాష్ శ్రీనివాసన్, కిశోర్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విశ్వ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. విశ్వ మృతి పట్ల పీఎం మోడీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi condoles demise of table tennis player D Vishwa
— ANI Digital (@ani_digital) April 18, 2022
Read @ANI Story | https://t.co/97HVVTqmn7
#PMModi #DVishwa pic.twitter.com/AzRJ6zmNLM
మరిన్ని వార్తల కోసం...