భారత స్టాక్ మార్కెట్.. అదేనండీ మన సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోతున్నాయా..మరో ఏడాదిలో అంటే 2025 సంవత్సరంలో..దారుణంగా పతనం కాబోతున్నదా.. ఎవరూ ఊహించని విధంగా మన స్టాక్ మార్కెట్ మటాష్ కాబోతున్నదా.. ప్రస్తుతం ఉన్న షేర్ల ధరలు అమాంతం తగ్గిపోనున్నాయా.. కొన్ని షేర్లు ఏకంగా 80 శాతం వరకు పడిపోనున్నాయా..ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు.. అమెరికా ఆర్థిక వేత్త హ్యారీ డెంట్ హెచ్చరిస్తున్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ తీరుపై ఆయన ఓ రివ్యూ ఇచ్చారు.. అదేంటో చూద్దాం...
రాబోయే రోజుల్లో అంటే 2025లో స్టాక్ మార్కెట్ కు పెద్ద ప్రమాదం పొంచి ఉందంటున్నారు ప్రముఖ అమెరికన్ ఎకనామిస్ట్ హ్యారీ డెంట్. భవిష్యత్ లో స్టాక్ మార్కెట్ అంతా మటాష్ అవుతుందంటున్నారు. ఇది 1925లో వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు. ఓ ఇంటర్వూలో డెంట్ మాట్లాడుతూ.. మే నెలల స్టాక్ మార్కెట్ లాభాలు .. తుఫాను ముందు నిశ్వబ్ధం లాంటిందన్నారు. ఇదంతా గాలి బుడగ.. పగలనంత వరకు బాగానే ఉంటుంది.. ఒకసారి పగిలిందా లైఫ్ టైం క్రాష్ ఉంటుందని హెచ్చరించారు.
హ్యారీ డెంట్ అమెరిక ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను బహిరంగంగా మాట్లాడే ఎకనామిస్ట్. ఇతను రాసి ‘‘ ది గ్రేట్ డిప్రెషన్ అహెడ్ ’’ అనే పుస్తకం బెస్ట్ సెల్లర్ లిస్ట్ లో కూడా ఉంది. మంగళవారం (జూన్ 12) న ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1925, 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం సహజమైనది. కానీ ఇప్పుడు రాబోయే తీవ్రమైన స్టాక్ మార్కెట్ క్రాష్ కృతిమమైనది.. దీని ప్రభావం జీవిత కాలం ఉంటుందని డెంట్ హెచ్చరిస్తున్నారు.. దీనికి ప్రపంచమంతా అల్లాడిపోతాయని తీవ్రమైన హెచ్చరికలు చేశారు.
2008లో మరోసారి ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని వణికించింది. 1925 కంటే ఇది ఎక్కువ నష్టాన్నే మిగిల్చింది. ఇక రాబోయే ఆర్థిక మాంద్యం మరింత తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్ లో చవిచూసిన లాభాలు ఎక్కువ కాలం ఉండవని.. స్టాక్ మార్కెట్ 86 శాతం క్షీణిస్తుందని అన్నారు.
మనం హ్యాంగోవర్ అయితే ఏం చేస్తాం.. మళ్లీ ఎక్కవుగా తాగుతాం.. ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా అదే అంటున్నారు డెంట్. అదనపు డబ్బుతో ఆర్థిక వ్యవస్థను ముంచెత్తడం వల్ల తాత్కాలికంగా అది మెరుగు పడొచ్చు. కానీ ఇది నీటి బుడగ లాంటిది.. పగిలిపోయినప్పుడు దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుందని డెంట్ హెచ్చరిస్తున్నారు.