సింగూర్ మంజీరా ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో టోర్నడో

సింగూర్ మంజీరా ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో టోర్నడో

సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం సింగూర్ జలాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దేవునూర్, నిర్జప్లా గ్రామాల మధ్య సింగూర్ బ్యాక్ వాటర్ లో టోర్నడో ఏర్పడింది. దీంతో నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోని మేఘాల్లోకి వెళ్లాయి. ఈ ఘటనను గ్రామస్థులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.