
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం (ఆగస్టు 04) కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండలపై నుంచి భారీగా వరదలు రావడంతో షాపులు, లోతట్లు ప్రాంతాలు మునిగిపోయాయి. జోరు వానకు భక్తులు తడిసి ముద్దయ్యారు. .
ఏడుకొండల వెంకన్న క్షేత్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో భక్తులు ఉల్లాసంగా గడిపారు. వర్షంలో తిరుమల గిరుల అందాలను చూసి తనివితీరా ఆస్వాదించారు. ఓ పక్క వెంకన్న నామస్మరణ.. మరోపక్క మనసును ఆహ్లాదపరిచే జడివానలో భక్తులు పరవశించిపోయారు.
ALSO READ : తిరుమల కొండపై దోపిడీ దొంగలు
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ఆహ్లాదకర వాతావరణాన్ని భక్తులు ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను వీడియోలు తీస్తూ, ఫోటోల్లో బంధించారు. మరో వైపు కుండపోతగా కురిసిన వర్షానికి దుఖానాలలోకి భారీగా నీరు చేరుకుంది.
ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో తిరుమలలో కూడా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.