శ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు

శ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు

శ్రీశైలం: ఉగాది వేడుకలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈనెల 30వ తేదీ వరకు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తారు. కర్నాటక, మహారాష్ట్రల నుంచి పాదయాత్ర చేస్తూ క్షేత్రానికి వస్తున్న భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం ఈవో లవన్న ఒక ప్రకటనలో తెలిపారు. కర్నాటక, మహారాష్ట్రల నుంచి భారీ సంఖ్యలో వస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని ఈనెల 24 నుంచే స్పర్శ దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నామని, స్పర్శ దర్శనం కోసం కేవలం ఒక క్యూ లైన్ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లల తల్లులు తమ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకుని దేవస్థానానికి సహకరించాలని ఈవో లవన్న కోరారు. 

 

ఇవి కూడా చదవండి

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

ఆస్పత్రిలో సేవలను స్వయంగా చూసి కలెక్టర్ ఏం చేశారంటే..

డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం లేదు.. కట్టిన చోట ఇవ్వట్లే

ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్నైనా స్వస్థలానికి పంపారా?

గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతోన్న ఐఏఎస్ ఎవరు?