గుడ్డిగా జీపీఎస్‌ను నమ్ముకొని పోతే.. నేరుగా సముద్రంలోకే తీసుకెళ్లింది

గుడ్డిగా జీపీఎస్‌ను నమ్ముకొని పోతే..   నేరుగా సముద్రంలోకే తీసుకెళ్లింది

గుడ్డిగా జీపీఎస్‌ను నమ్ముకుని వెళ్లిన ఓ ఇద్దరు పర్యాటకులకు వింత అనుభవం ఎదురైంది. జీపీఎస్‌ను నమ్ముకుని కారులో వెళ్లి  చివరకు సముద్రంలో పడ్డారు. ఈ ఘటన  అమెరికా లోని హవాయి  రాష్ట్రంలో చోటుచేసుకుంది. చుట్టు పక్కల వాళ్లు దీనిని గమనించి  నీటిలో దూకి వారిని రక్షించడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

కైలువా కోన ప్రాంతంలోని హునాకోహౌ స్మాల్ బోట్ హార్బర్ లో ఇద్దరు పర్యాటకులు మాంటరే ఎక్స్‌కర్షన్ అనే ప్రాంతానికి వెళ్లేందుకు జీపీఎస్  ను ఆన్  చేసుకుని  కారును డ్రైవింగ్ చేసుకుంటూవెళ్లారు. కారు నేరుగా హార్బర్‌లోకి వెళ్లి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వారు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నారు.  

వెంటనే దీనిని గమనించిన  స్థానికులు నీటిలోకి దూకి కారులో చిక్కుకుపోయిన వారిని  బయటకు సురక్షితంగా బయటకు తరలించారు.  ఆ తర్వాత కారుకు తాళ్లను కట్టి సముద్రం లోపల నుంచి బయటకు లాగారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.  

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాము సముద్రం వైపు వెళుతున్నామనే సోయ కూడా లేకుండా జీపీఎస్ ను గుడ్డిగా నమ్మి వెళ్లినట్లుగా ఆ పర్యాటకులు తెలిపారు.