సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు ప్రభుత్వం ఎత్తుగడ

సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు ప్రభుత్వం ఎత్తుగడ

రైతులకు విత్తన డీలర్లు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఆ షాపులను క్లోజ్ చేస్తామన్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు తెరవనీయనని ఓ కలెక్టర్ బెదిరించడం ఏంటని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టు కన్నా సుప్రీమా అని ఆయన  ప్రశ్నించారు. 

రైతుల ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఓ రకంగా రైతులపై బ్లాక్ మెయిల్ దిగుతోందని అన్నారు. రాష్ట్రంలో వరి పండించే అవకాశం లేనప్పుడు మరి లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టుల కట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ వెంకట్రామారెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

For More News..

వరి విత్తనాలు అమ్మితే షాపు ​క్లోజ్ చేస్తం

వ్యాక్సిన్ తీసుకోనివారిపై హెల్త్ డైరెక్టర్ కీలక నిర్ణయం