ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్,  వెలుగు: మునుగోడు బై ఎలక్షన్​లో కాంగ్రెస్, టీఆర్ఎస్​ల మధ్యే పోటీ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ బొమ్మ మహేశ్​గౌడ్​ తెలిపారు.  నిజామాబాద్​లోని కాంగ్రెస్ భవన్ లో సోమవారం మహేష్  గౌడ్  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎవరితో పొత్తులు ఉండవని అన్నారు.  మునుగోడు బై ఎలక్షన్​లో లబ్ధి కోసమే సీఎం కేసీఆర్​ గిరిజనబంధు స్కీమ్ అంటున్నారని విమర్శించారు.  కేసీఆర్ సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టగానే దళితులను ఉద్ధరించినట్లు కాదని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో కేసీఆర్​ నటిస్తున్నారని చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో దళితులకు సీఎం పదవి హామీతో మోసగించాడని మండిపడ్డారు.  

అధికారంలో ఉన్నా బీజేపీ, టీఆర్ఎస్ ఎనిమిదేండ్లుగా సెప్టెంబర్​17ను ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర లేని బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.  నాటి ప్రధాని నెహ్రూ కేబినెట్ లో  తీసుకున్న నిర్ణయం మేరకే సర్దార్ పటేల్  హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసినట్లు గుర్తుచేశారు. వజ్రోత్సవాల పేరుతో ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాపు రూ. 35 లక్షలు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని, అమిత్​షాతో  కేసీఆర్​కు చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని 8 ఏళ్లగా ఆరోపిస్తున్న  కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆ అవినీతిలో రాష్ట్ర బీజేపీ నాయకుల వాటా ఎంత అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి , పీసీసీ కార్యదర్శి రాంభూపాల్,  అర్బన్​ అధ్యక్షుడు కేశ వేణు , బీసీ సెల్ లీడర్​శేఖర్ గౌడ్,  కిసాన్ కాంగ్రెస్  ప్రెసిడెంట్​గంగారెడ్డి,  ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్,  మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నీరడి భాగ్య, లీడర్లు చంద్రకళ, రేవతి, సుజాత, విజయలక్ష్మి, మల్లికా బేగం,  ఆశాబి పాల్గొన్నారు.

వీఆర్ఏలకు మద్దతుగా బీజేపీ దీక్షలు

కామారెడ్డి,  వెలుగు: వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు మద్దతుగా సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో  దీక్షలు చేపట్టారు.  కామారెడ్డి  మున్సిపల్​ ఆఫీసు ఎదురుగా అంబేద్కర్​ విగ్రహం వద్ద  ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు.  నియోజకవర్గ ఇన్​చార్జ్​ కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు దీక్షలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ  వీఆర్ఏలు  57 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కార్​ పట్టించుకోవడం లేదన్నారు.  

సమస్యలు పరిష్కారమవుతాయో లేదోననే ఆందోళనతో  పలువురు వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.  వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలన్నారు.  వారంలోపు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే  ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్​, జిల్లా వైస్ ప్రెసిడెంట్​ వెంకట్​రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​లక్ష్మారెడ్డి,  మండలాల పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, చారి, రాజేశ్, విపపుల్​, కౌన్సిలర్లు శ్రీకాంత్​,  శ్రీనివాస్​, ప్రవీన్​,  నరేందర్, రవి,  మానస తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

పిట్లం, వెలుగు: ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కరించినపుడే మండల సభ కు విలువ ఉంటుందని ఎమ్మెల్యే హన్మంత్​ షిండే అన్నారు. సోమవారం ఎంపీపీ కవిత అధ్యక్షతన పిట్లం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, చేయాల్సిన పనులను చర్చించుకోవడానికి మూడు నెలలకోసారి మండల సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిట్లం మీదుగా హైవే నిర్మాణం  కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇక్కడి పరిస్థితిని హెల్త్​మినిష్టర్​హరీశ్​రావు దృష్టికి తీసుకెళ్లడంతో మండల పరిధిలో  ట్రామా సెంటర్​ మంజూరు చేసినట్లు తెలిపారు.

అనంతరం అంశాల వారీగా ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ప్రధానంగా ఐసీడీఎస్​ సమీక్షలో సూచనలు చేశారు. గ్రామాలలో కొత్తగా పెళ్లి అయిన వారితో సమావేశం ఏర్పాటు చేసి అంగన్​వాడీలపై అవగాహన కల్పించాలని సూపర్​వైజర్​లను ఆదేశించారు. 103 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు. అనంతరం జుక్కల్​లో నిర్వహించిన మండల సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ  శ్రీనివాస్​రెడ్డి, మార్కెట్​ కమిటీ చైర్మన్ లక్ష్మీబాబుసింగ్​, వైస్​ ఎంపీపీ లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​సాయిరెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి కో ఆర్డినేటర్​ దేవేందర్​రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్​ రామ్మోహన్​రావు పాల్గొన్నారు.

సిద్ధులగుట్టపై పూజలు, పల్లకీసేవ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్​లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. గుట్టపైనున్న శివాలయం, రామాలయం, దుర్గామాత, అయ్యప్ప ఆలయాల్లో పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం నుంచి జీవ కొనేరు వరకు  ఉత్సవమూర్తులతో పల్లకీసేవ జరిపారు. పిప్రిగైని భజన మండలి ఆధ్వర్యంలో భజన గీతాలు ఆకట్టుకున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్​ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు రాజవ్వ, వెంకట్రాజ్, టీఆర్ఎస్​ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 

ట్రాన్స్​ఫార్మర్ ఆయిల్, సామగ్రి చోరీ

ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండలంలోని మద్దుల్​తండా శివారులో ఆదివారం రాత్రి దొంగలు 16 కేవీ ట్రాన్స్​ఫార్మర్​ను పగలగొట్టి అందులోని ఆయిల్​ను, ఇతర విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. తండాకు చెందిన సబావత్​ బాపురావ్​ ఈ ట్రాన్స్​ఫార్మర్​ను సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. బాపురావ్​ పోలీసులు, ట్రాన్స్​కో అధికారులకు ఫిర్యాదు చేశారు. 

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

కామారెడ్డి, వెలుగు: మహిళా సంఘాలకు ఇచ్చే లోన్లతో వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని  కలెక్టర్​ జితేశ్ వి.పాటిల్​  సూచించారు.   సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ ఆధ్వర్యంలో మహిళ మహోత్సవం నిర్వహించారు.   మహిళ సంఘాలకు రూ.20 కోట్ల లోన్​ చెక్కులను  అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ  వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకొచ్చే సంఘాలకు బ్యాంకులు లోన్లు ఇస్తాయన్నారు.  బ్యాంక్​ చైర్మన్​శోభ,  రీజినల్​ మేనేజర్​ నారాయణ, లీడ్​ బ్యాంక్​ మేనేజర్​రమేశ్​,  డీఆర్​డీవో సాయన్న, నాబార్డు డీడీఎం నరేశ్, ప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యలు తీర్చాలంటూ ధర్నా

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: గ్రామ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ నిజాంసాగర్ మండలం పిప్పిరేగడి తండావాసులు ఎల్లారెడ్డి– నిజాంసాగర్​ మెయిన్​రోడ్డుపై సోమవారం ధర్నా చేశారు. అనంతరం మండల పరిషత్​లో ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ తనకు ఓట్లేయలేదని స్థానిక ప్రజాప్రతినిధి తమ గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇదే అదనుగా ఆఫీసర్లు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే ధర్నా చేస్తున్నామన్నారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు... తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. తమ తండాలో అభివృద్ధి పనులు చేయకున్నా చేసినట్లు బిల్లులు కాజేశారని తెలిపారు. ఎంపీడీఓ నాగేశ్వర్ గ్రామస్తులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.  

గ్రీవెన్స్​లో భూసమస్యలే ఎక్కువ

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్​లో  సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​డేలో భూ సంబంధ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. 62 ఫిర్యాదులు రాగా అందులో భూసమస్యలు 34 వచ్చాయి.  అడిషనల్ కలెక్టర్​ వెంకటేశ్​దొత్రే,  అసిస్టెంట్ కలెక్టర్​ శివేంద్ర ప్రతాప్​, డీఆర్​డీవో సాయన్న,  జడ్పీ సీఈవో సాయాగౌడ్​ , ఏవో రవీందర్ ​పాల్గొన్నారు.

నిజామాబాద్​లో 55 ఫిర్యాదులు

నిజామాబాద్ టౌన్ వెలుగు: గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను సూచించారు. కలెక్టరేట్​లో  సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​డేకు 55 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, డీపీవో జయసుధ అర్జీలు స్వీకరించారు.  గ్రీవెన్స్ అనంతరం కలెక్టర్​రెసిడెన్షియల్​స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్ల నిర్వహణపై రివ్యూ చేశారు. హాస్టళ్లలో వంట గది, డైనింగ్ హాల్ పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

మోడీ  జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్

మోర్తాడ్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో పీఎం జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. నరేంద్ర మోడీ బాల్యం, యవ్వనం, రాజకీయ నేపథ్యం.. తదితర ఫొటోలను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో  బీజేపీ జిల్లా కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంజీవ్, లీడర్లు మల్కాన్నగారి మోహన్ ,  కార్యకర్తలు పాల్గొన్నారు.

పోడు పత్రాలు ఇవ్వాలని ధర్నా

కామారెడ్డి , వెలుగు: పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ  సీపీఎం ఆధ్వర్యంలో రైతులు కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా సోమవారం నిర్వహించారు.  టౌన్​ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి  ఆందోళన చేశారు.  సీపీఎం జిల్లా సెక్రటరీ  వెంకటిగౌడ్​ మాట్లాడుతూ రైతులపై  ఫారెస్ట్​ఆఫీసర్లు పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. 
 హక్కు పత్రాల కోసం మరోసారి అప్లికేషన్​పెట్టుకునే అవకాశం కల్పించాలని డిమాండ్​  చేశారు. లీడర్లు మోతిరాం, సురేష్​,  ప్రకాష్​, గణేశ్​ తదితరులు ఉన్నారు.  

పోడు రైతుల ఆందోళన

పిట్లం, వెలుగు: పోడు  భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో జుక్కల్ ​వద్ద హైవేపై పోడు రైతులు ఆందోళన చేశారు. రైతు సంఘం నాయకుడు సురేశ్​మాట్లాడుతూ ప్రభుత్వం 140 జీవో అమలు చేయాలని డిమాండ్​ చేశారు. 

బాధిత కుటుంబానికి మంత్రి అల్లోల పరామర్శ

నందిపేట, వెలుగు: ​నందిపేట మండలం డొంకేశ్వర్​ గ్రామ మాజీ సర్పంచ్ పొద్దుటూరి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పరామర్శించారు.  నర్సింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు.  కాగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి సానుభూతి తెలియజేశారు.