
న్యూఢిల్లీ: గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ టీపీజీ తన జాయింట్ వెంచర్ స్కాట్పూణావాలాలో 35 శాతం వాటాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) నుంచి కొంటుందని స్కాట్ ఫార్మా మంగళవారం తెలిపింది. అయితే డీల్ విలువను మాత్రం వెల్లడించలేదు.
స్కాట్ఫార్మా, ఎస్ఐఐ జేవీని ఏర్పాటు చేశాయి. ఇది సైరస్ పూణావాలా గ్రూప్‌లో భాగం. ఇది వ్యాక్సిన్లను తయారు చేస్తుంది. టీపీజీ మిడిల్ మార్కెట్ గ్రోత్ ఈక్విటీ ప్లాట్‌ఫామ్ అయిన టీపీజీ గ్రోత్, నోవో హోల్డింగ్స్‌తో కలిసి సహ-పెట్టుబడిదారుగా వాటా కొనుగోలుకు నిధులు సమకూరుస్తోంది. లావాదేవీ తర్వాత, ఎస్ఐఐ కంపెనీలో మైనారిటీ వాటాను నిలుపుకుంటుంది.