ఈ దంతేరాస్‌‌‌‌కు రూ.50 వేల కోట్ల వ్యాపారం!

ఈ దంతేరాస్‌‌‌‌కు రూ.50 వేల కోట్ల వ్యాపారం!
  • చైనాకు రూ. లక్ష కోట్ల లాస్ వస్తుందంటున్న వ్యాపారులు
  • వోకల్ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకల్‌‌‌‌‌‌‌‌కు కన్జూమర్ల నుంచి మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  వ్యాపారులు దంతేరాస్ (ఈ నెల 10,  11)  పై ఫుల్ ఫోకస్ పెట్టారు.  ఈ  పండుగ రోజు దేశం మొత్తం మీద సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనావేస్తున్నారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన వోకల్ ఫర్ లోకల్‌‌ ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌కు మంచి స్పందన వస్తోందని కాన్ఫడరేషన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌ (కైట్‌‌‌‌‌‌‌‌) నేషనల్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్ ఖండేల్వాల్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. మహిళా వ్యాపారులకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలవాలని పబ్లిక్‌‌‌‌‌‌‌‌ను ఆయన కోరారు.  ఈ దీపావళి నాడు  వోకల్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకల్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలవాలని, దీపాల నుంచి  బొటిక్‌‌‌‌‌‌‌‌ల వరకు వివిధ బిజినెస్‌‌‌‌‌‌‌‌లలో ఉన్న ఉమెన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్ల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు కొనాలని కోరారు.  వోకల్ ఫర్ లోకల్‌‌‌‌‌‌‌‌ ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ అవ్వడంతో కన్జూమర్లు ఇండియాలో తయారైన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో  ఈ దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌లో చైనాకు రూ. లక్ష కోట్ల రెవెన్యూ లాస్ వస్తుందని వ్యాపారులు  అంచనావేస్తున్నారు. కాగా, దంతేరాస్‌‌‌‌‌‌‌‌ నాడు సిద్ధి వినాయకుడిని, లక్ష్మీ దేవిని, కుబేరుడిని పూజించడం ఆనవాయితీ. ఈ రోజున ఏమైనా కొనుగోలు చేయడం మంచిదిగా భావిస్తారు.  బంగారం, వెండి నగలు, కిచెన్‌‌‌‌‌‌‌‌లో వాడుకునే సామాన్లు, బండ్లు, క్లాత్స్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రానిక్‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా అమ్ముడవుతాయి. నగల వ్యాపారులు దంతేరాస్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌పై ఆశలు పెట్టుకున్నారని ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా జ్యువెలర్స్‌‌‌‌‌‌‌‌ అండ్ గోల్డ్‌‌‌‌‌‌‌‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్‌‌‌‌‌‌‌‌) నేషనల్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ పంకజ్‌‌‌‌‌‌‌‌ అరోరా వెల్లడించారు. డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో  వ్యాపారులు సరిపడా స్టాక్‌‌‌‌‌‌‌‌ మెయింటైన్ చేస్తున్నారని, కొత్త డిజైన్లతో నగలను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెస్తున్నారని చెప్పారు. ఫేమస్‌‌  ఛాందిని చౌక్‌‌‌‌‌‌‌‌, దరిబా కలాన్‌‌‌‌‌‌‌‌, సాదర్ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి  మార్కెట్లలో  సేల్స్ భారీగా పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

పెరిగిన ఎగుమతులు

సెమీ కండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిప్‌‌‌‌‌‌‌‌ల నుంచి  గూడ్స్ వరకు వివిధ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు ఇండియాలోనే తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చైనా నుంచి  దిగుమతులు తగ్గించుకోవాలని చూస్తోంది. బీసీజీ స్టడీ ప్రకారం,  ఇండియా నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌కు   ఎగుమతి అవుతున్న ఆటో కాంపోనెంట్లు, మెకానికల్ మెషినరీ, సెమీకండక్టర్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌ గత ఐదేళ్లలో మంచి గ్రోత్ నమోదు చేశాయి.  ఇండియా నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌కు జరుగుతున్న సెమీకండక్టర్స్ అండ్ మెటీరియల్స్ ఎగుమతులు  143 శాతం గ్రోత్ నమోదు చేశాయి. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో చైనా నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌కు వీటి ఎగుమతులు 29 శాతం తగ్గాయి. అదనంగా  యూఎస్‌‌‌‌‌‌‌‌కు ఎగుమతి అవుతున్న ఆటో కాంపోనెంట్లు గత ఐదేళ్లలో 65 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను, మెకానికల్ మెషినరీలు 70 శాతం  గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేశాయి. కంపెనీలు చైనా నుంచి తమ మాన్యుఫాక్చరింగ్ బేస్‌‌‌‌‌‌‌‌ను షిఫ్ట్ చేస్తుండడంతో ఇండియా ఎక్కువగా లాభపడుతోంది.  గత ఐదేళ్లలో ఇండియా నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌కు జరుగుతున్న ఎగుమతులు 23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.  ఇది 44 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానం. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో చైనా నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌కు జరుగుతున్న ఎగుమతులు 10 శాతం తగ్గాయి.