
Pakistan Stock Exchange: ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అటు ఆర్థికంగా చూసినా లేక ఇటు భద్రత పరంగా చూసినా పాక్ పూర్తిగా భూస్థాపితం అయ్యిందని తాజా పరిణామాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. పాక్ నేతలు చేస్తున్న బెదిరింపులు కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమేనని అక్కడి స్థానికులు చెప్పటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఇండియాలో పహల్గామ్ దాడి తర్వాతి నుంచి పాకిస్థాన్ లోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతూనే ఉన్నాయి. అక్కడి ప్రజలు సైతం యుద్ధం వస్తుందనే భయంతో ప్రాణాలు అరచేతినపట్టుకుని బ్రతుకుతున్నారు. అలాగే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని భయంతో బ్యాంకుల నుంచి డబ్బును భారీగా విత్ డ్రా చేస్తున్నారు. అలాగే నెలలకు సరిపడా ఆహార పదార్థాలను ఇళ్లలో స్టాక్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
అయితే నిన్న ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలుతున్నాయి. భారత మంత్రులు సైతం సిందూర్ ఇంకా ముగిలేదని, దేశ రక్షణ కోసం అవసరమైతే మరిన్ని దాడులు చేపడతామని చెబుతున్న వేళ పాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో గందరగోళం నెలకొంది. నిన్నటి పతనం తర్వాత నేడు గురువారం కూడా అక్కడి స్టాక్ మార్కెట్లు 7 శాతం క్షీణతను చూసింది.
►ALSO READ | స్టార్ లింక్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్.. ఇండియాని దారికి తెచ్చుకున్న ఎలాన్ మస్క్!
పరిస్థితులు ప్రస్తుతం దిగజారుతున్నందున పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ నిలిపివేసినట్లు వెల్లడైంది. నేడు పాకిస్థాన్ లోని కరాచీ, లాహోర్ సహా మరిన్ని నగరాల్లో పెద్ద పేలుళ్లు సంబవించిన తర్వాత పెట్టుబడిదారులు అమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు భారీగా అమ్మకాలకు దిగటంతో మార్కెట్లు చివరికి మూతపడ్డాయి. ఈ క్రమంలో కేఎస్ఈ 100 సూచీ 6 శాతం నష్టపోయింది. అయితే దిగజారుతున్న పరిస్థితులతో ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్తి తీసుకోవటానికి ఎక్కువగా మెుగ్గుచూపటమే దీనికి కారణంగా నిపుణలు చెబుతున్నారు. అలాగే ఐఎంఎఫ్ అందించే ప్యాకేజీపైనే పాక్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడటంతో పరిస్థితులు అక్కడ రోజురోజుకూ దిగజారుతున్నాయి.