హైదరాబాద్ సిటీలో రేపు (జనవరి 26న)..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు

హైదరాబాద్ సిటీలో రేపు (జనవరి 26న)..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు

మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. 

టివోలి ఎక్స్‌ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్స్ మధ్య రహదారి మూసివేయనున్నారు. సంగీత్ ఎక్స్‌ రోడ్స్, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్​బీఐ, ప్లాజా, సీటీవో, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బండ్, బాలమ్రాయ్, రసూల్‌పురా, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ సమయంలో ఎస్పీ రోడ్, ఎంజీ రోడ్, ఆర్‌పీ రోడ్, ఎస్‌డీ రోడ్లను వీలైనంతవరకు తప్పించుకోవాలని సూచించారు. 

ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయల్దేరాలని, మెట్రో సేవలను వినియోగించాలని కోరారు. బేగంపేట, కర్ఖానా, జేబీఎస్, ప్యాట్నీ, సంగీత్ ఎక్స్‌ రోడ్స్, టివోలి, బోయిన్​పల్లి వైపుల నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలకు డైవర్షన్​ చేసేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 8712662999 నంబర్​లో సంప్రదించాలని సూచించారు.