
హైదరాబాద్ సిటీ, వెలుగు: నారాయణగూడలోని వైఎంసీఎ వద్ద బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు సదర్ ఉత్సవ్ మేళా జరుగనుంది. దీంతో నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ ప్రకటించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
రాంకోటి, లింగంపల్లి క్రాస్ రోడ్స్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద టూరిస్ట్, సుల్తాన్‌బజార్ వైపు మళ్లిస్తారు. విఠల్‌వాడి క్రాస్ రోడ్స్ నుంచి రాజ్‌మొహల్లా చిల్లా వైపు వచ్చే ట్రాఫిక్‌ను పద్మశాలి భవన్ వద్ద రాంకోటి క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సిమెటరీ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను విఠల్‌వాడి క్రాస్ రోడ్స్ వద్ద రామ్‌కోటి క్రాస్ రోడ్స్ వైపు డైవర్ట్ చేస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, క్రౌన్ కేఫ్ నుంచి వైఎంసీఏ వచ్చే ట్రాఫిక్‌ను నారాయణగూడ క్రాస్ రోడ్స్ వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు, నారాయణగూడ క్రాస్ రోడ్స్ నుంచి ఆర్బీవీఆర్ఆర్ కాలేజీ వైపు వచ్చే వాహనాలను బాబా టెంట్ హౌస్ వద్ద క్రౌన్ కేఫ్ వైపు మళ్లిస్తారు.
బాగ్ లింగంపల్లి కాలనీ లేన్స్, బైలేన్స్, వైఎంసీఏ నుంచి వచ్చే వెహికల్స్‌ను రెడ్డి కాలేజీ జంక్షన్ వద్ద బాబా టెంట్ హౌస్ వైపు పంపిస్తారు. బర్కత్‌పుర చమన్ నుంచి వైఎంసీఏ వచ్చే ట్రాఫిక్‌ను పోస్టాఫీస్ జంక్షన్ వద్ద క్రౌన్ కేఫ్ వైపు, క్రౌన్ కేఫ్ నుంచి లింగంపల్లి క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను పోస్టాఫీస్ జంక్షన్ వద్ద బర్కత్‌పుర చమన్ వైపు మళ్లిస్తారు. లింగంపల్లి క్రాస్ రోడ్స్, లింగంపల్లి కాలనీ బైలేన్స్ ఆర్బీవీఆర్ఆర్ కాలేజీ వైపు వచ్చే వెహికల్స్‌ను మాత టెంపుల్ వద్ద పోస్టాఫీస్ జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు.
కాచిగూడ క్రాస్ రోడ్స్ నుంచి పోస్టాఫీస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లింగంపల్లి క్రాస్ రోడ్స్ వద్ద బర్కత్‌పుర చమన్ ద్వారా టూరిస్ట్ జంక్షన్ వైపు పంపిస్తారు. టూరిస్ట్ జంక్షన్ నుంచి లింగంపల్లి క్రాస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బర్కత్‌పుర చమన్ వైపు మళ్లిస్తారు.
ఆర్టీసీ బస్సులు ఇలా..
సికింద్రాబాద్ నుంచి కోఠికి, వైస్ వెర్సా నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు వైఎంసీఏ సర్కిల్, నారాయణగూడ క్రాస్ రోడ్స్ రోడ్డులో కాకుండా.. బర్కత్‌పుర, పోస్ట్ ఆఫీస్ జంక్షన్, బాగ్ లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వెళ్తాయి.
కేశవ్ మెమోరియల్ గ్రౌండ్స్‌లో పార్కింగ్..
సదర్ మేళాకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను కేశవ్ మెమోరియల్ కాలేజీ గ్రౌండ్స్‌లో పార్క్ చేయొచ్చని జాయింట్ సీపీ తెలిపారు. ఈ పార్కింగ్ స్థలంలో 400 టూ-వీలర్లు , 400 ఫోర్- వీలర్లు పార్క్ చేసుకోవచ్చన్నారు.