కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ

కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ

కేతేపల్లి( నకిరేకల్ ), వెలుగు: కేతేపల్లి మండలంలోని హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి 65 పై కొర్లపహాడ్ టోల్​గేట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం వాహనాల రద్దీ నెలకొంది. బోనాల పండుగ,  శ్రీకృష్ణాష్టమి, ఆదివారం.. వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్​నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు పయనమయ్యారు. టోల్​గేట్​వద్ద సమయం వృథా అవుతోందని, రద్దీగా ఉన్న రోజుల్లో క్యూలైన్లు పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.