దుందుభి వాగుపై రాకపోకలు బంద్

దుందుభి వాగుపై రాకపోకలు బంద్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తాడూరు మండలం సిర్సవాడ శివారులో దుందుభి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగుకు వరద పోటెత్తింది. బుధవారం తాడూరు మండలం సిర్సవాడ నుంచి మాదారం వెళ్తున్న ట్రాక్టర్  ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే సిర్సవాడ, పాపగల్  మధ్యలో వాగు ఉప్పొంగుతోంది.