డెంగీతో వ్యక్తి మృతి

డెంగీతో వ్యక్తి మృతి

మహాముత్తారం, వెలుగు :  జయశంకర్  భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన అజ్మీరా భాస్కర్ నాయక్ (33) డెంగీ జ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భాస్కర్ గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బాధితుడిని హనుమకొండ, హైదరాబాద్​లోని  ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్మెంట్ చేయించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి చనిపోయాడు. అప్పు చేసి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.