అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. మెదక్‌‌ జిల్లా వెల్దుర్తిలో విషాదం

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. మెదక్‌‌ జిల్లా వెల్దుర్తిలో విషాదం

వెల్దుర్తి, వెలుగు: అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మేడ్చల్‌‌ నాగరాజు (32) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంట పెట్టుబడితో పాటు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. 

అప్పులు పెరిగిపోవడంతో అవి తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురైన నాగరాజు శనివారం పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి నాగరాజును హైదరాబాద్‌‌లోని హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.