మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. గంగారాం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్ఐ శోభన్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకున్నాడు. 

సత్తుపల్లి బెటాలియన్ లో ఏఆర్ ఎస్ఐగా శోభన్ బాబు విధులు నిర్వహిస్తున్నాడు. మెడికల్ లీవ్ లో సోమవారం (సెప్టెంబర్ 18న) ఇంటికి వచ్చాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.