ట్రెడ్ మిల్ చేస్తూ.. కరెంట్ షాక్ తో.. జిమ్ లోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

ట్రెడ్ మిల్ చేస్తూ.. కరెంట్ షాక్ తో.. జిమ్ లోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

ఉత్తర ఢిల్లీలో రోహిణి ప్రాంతంలోని ఓ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై ఉండగానే విద్యుదాఘాతంతో 24 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఘటన జూలై 18న చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుడు రోహిణి సెక్టార్ 19కి చెందిన పృథ్వీగా గుర్తించిన అధికారులు.. అతను బీటెక్ డిగ్రీ పూర్తి చేసి గురుగ్రామ్‌లోని ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు తెలిపారు.

మంగళవారం ఉదయం 7:30 గంటలకు సెక్టార్ 15లోని జింప్లెక్స్ ఫిట్‌నెస్ జోన్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడున్న సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించినట్టు సమాచారం. పోస్టుమార్టంలో విద్యుదాఘాతమే మృతికి కారణమని వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనలో జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిమ్ లో యంత్రాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

रोहिणी में जिम में वर्कआउट करते वक्त ट्रेडमिल में दौड़ा करंट, युवक की मौत ।
जिम संचालक के खिलाफ मुकदमा दर्ज ।
रोहिणी के केएन काटजू मार्ग इलाके में एक जिम के अंदर ट्रेडमिल में करंट आने से एक नौजवान युवक की दर्दनाक मौत हो गई। घटना मंगलवार सुबह सात बजे की है। मृतक 24 साल का है। pic.twitter.com/Z13ZoVmHut

— Atulkrishan (@iAtulKrishan) July 20, 2023