బీబీనగర్ లో రోడ్ టెర్రర్..వాకర్స్ పై దూసుకెళ్లిన థార్ వాహనం..స్పాట్ లోనే భార్యాభర్తలు మృతి

బీబీనగర్ లో  రోడ్ టెర్రర్..వాకర్స్ పై దూసుకెళ్లిన థార్ వాహనం..స్పాట్ లోనే భార్యాభర్తలు మృతి

పొద్దుపొద్దన్నే ఘోర ప్రమాదం.. వాతావరణం బాగుంది కదా అని చెరువు దగ్గర బైక్​ పార్కింగ్​ చేసి నిల్చోవడమే వారి ప్రాణాల మీదకు తెచ్చింది.. వేగంగా దూసుకొచ్చిన జీపు వారి పాలిట యుముడిలా మృత్యువును కబలించింది..ఆదివారం ఉదయం బీబీనగర్​ చెరువు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం( నవంబర్​2) బీబీనగర్​ చెరువు దగ్గర థార్​ వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన థార్​ వాహనం రోడ్డుపక్కన బైక్​ పార్కింగ్​ చేసి నిల్చున్న భార్యాభర్తలపైకి దూసుకెళ్లడంతో స్పాట్​ లో నే చనిపోయారు. జీపు వేగం ధాటికి ఇద్దరు ఎగిరి చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సకోసం  భువనగిరి ఆస్పత్రికి తరలించారు.