ఈతకు వెళ్లి యువకుడు మృతి.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఘటన

ఈతకు వెళ్లి యువకుడు మృతి.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఘటన

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటి కుంటలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌‌ పట్టణానికి చెందిన ఎండీ.చాంద్‌‌పాషా (21) బుధవారం తన ఫ్రెండ్స్‌‌ ఎండీ.గౌస్, ఎండీ.మబ్బుల్, ఎండీ.షాదుల్‌‌తో కలిసి జనగామ శివారులోని క్రషర్‌‌ నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు.

ఈత కొడుతున్న క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో చాంద్‌‌పాషా నీటిలో మునిగిపోయాడు. గమనించిన అతడి ఫ్రెండ్స్‌‌ కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో నీటి కుంటలో గాలించి చాంద్‌‌పాషా డెడ్‌‌బాడీని బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.