హుస్నాబాద్, వెలుగు: కొడుకు వేధింపులు తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసుల తెలిపిన ప్రకారం.. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన బోడ కనకవ్వ(75)కు కొడుకు రవి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు రోజు తాగొచ్చి తల్లిని వేధిస్తుండగా తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. కొడుకు వేధింపుల కారణంగానే తల్లి చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె కూతురు బొల్లి సుగుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
