మొబైల్‌ నెంబర్‌‌ 11 అంకెలు కాదు..ముందు ‘0‘ చేరుతుందంతే

మొబైల్‌ నెంబర్‌‌ 11 అంకెలు కాదు..ముందు ‘0‘ చేరుతుందంతే

న్యూఢిల్లీ: మొబైల్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ను 10 అంకెల నుంచి 11 అంకెలకు మార్చాలని తాము ప్రతిపాదించలేదని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదివారం పేర్కొంది. కానీ ల్యాండ్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి మొబైల్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్‌‌‌‌ చేసేటప్పుడు నెంబర్‌‌‌‌‌‌‌‌ ముందు ‘0’ ని యాడ్‌‌‌‌ చేయాలని రికమండ్‌‌‌‌ చేశామని తెలిపింది. నెంబర్‌‌‌‌‌‌‌‌ ముందు ‘0’ ని యాడ్‌‌‌‌ చేయడం వలన  అదనంగా 254.4 కోట్ల నెంబర్లను క్రియేట్‌‌‌‌ చేయొచ్చని పేర్కొంది. ఇవి భవిష్యత్‌‌‌‌ అవసరాలకు సరిపోతాయని అంచనావేసింది. ఇప్పుడున్నట్టే 10 అంకెలతో మొబైల్‌‌‌‌ నెంబర్లు కొనసాగుతాయని ట్రాయ్‌‌‌‌ తన రికమండేషన్లలో పేర్కొంది. 10 నుంచి 11 అంకెలకు షిప్ట్‌‌‌‌ అవ్వడాన్ని కొట్టిపారేసింది. ‘ట్రాయ్‌‌‌‌ ఎటువంటి 11 డిజిట్‌‌‌‌ నెంబరింగ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను రికమండ్‌‌‌‌ చేయలేదు.  ల్యాండ్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి మొబైల్‌‌‌‌ నెంబర్లకు డయల్‌ చేసేటప్పుడు నెంబర్‌‌‌‌‌‌‌‌ ముందు ‘0’ ని యాడ్‌‌‌‌ చేయడాన్ని ప్రతిపాదించాం’ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. ల్యాండ్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి ల్యాండ్‌‌‌‌లైన్‌‌‌‌కు, మొబైల్‌‌‌‌ నుంచి ల్యాండ్‌‌‌‌లైన్‌‌‌‌కు, మొబైల్‌‌‌‌ నుంచి మొబైల్‌‌‌‌కు కాల్స్‌‌‌‌ చేయడంపై ఎటువంటి డయలింగ్‌‌‌‌ ప్యాటర్న్‌‌‌‌ను మార్చాల్సిన అవసరం లేదని ట్రాయ్‌‌‌‌ పేర్కొంది. 11 అంకెల నెంబర్‌‌‌‌‌‌‌‌కు మారడం వలన తమకు అదనపు ఖర్చు అవుతుందని టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారు. నెంబరింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ మారితే అదనంగా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌, హార్డ్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ పరంగా చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని, కస్టమర్లలో గందరగోళం నెలకొంటుందని పేర్కొన్నాయి.

ఫర్నీచర్ పార్కులు అవసరం