యూనివర్సల్‌‌గా నచ్చే కథతో..  ఫ్యామిలీ స్టార్

యూనివర్సల్‌‌గా నచ్చే కథతో..  ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను గురువారం విడుదల చేశారు. హీరోయిజంతో పాటు లవ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి అన్ని కమర్షియల్‌‌ ఎలిమెంట్స్‌‌తో కట్ చేసిన ఈ ట్రైలర్‌‌‌‌ ఆకట్టుకుంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను, ఇందులోని హీరోహీరోయిన్స్ పాత్రలను ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు.

ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. క్యారెక్టర్స్, విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ లాంటివన్నీ మీకు నచ్చేలా ఉంటాయి’ అని చెప్పాడు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘విజయ్ పాత్రలో క్లాస్‌‌, మాస్‌‌, యూత్‌‌కు నచ్చే ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌, ఎమోషన్‌‌ ఉండేలా పరశురామ్ రాశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూ ఉంటారు. 21 ఏళ్ల క్రితం ఏప్రిల్ 5న విడుదలైన ‘దిల్‌‌’ సినిమాతో నేను నిర్మాతను అయ్యా. ఇప్పుడు అదే రోజున ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌’ వస్తోంది. ఫుల్‌‌గా ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుంది. యూనివర్సల్‌‌గా అందరికీ నచ్చే కథ గల సూపర్ హిట్ సినిమాతో థియేటర్స్‌‌కి వస్తున్నాం’ అన్నారు.