
నవీన్ చంద్ర హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఎన్ సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో నవీన్ చంద్ర ఇలా ముచ్చటించాడు.
‘‘ఇటీవల తమిళంలో వేసిన ప్రీమియర్ షోస్‌కు అద్భుత స్పందన లభించింది. మేము అనుకున్న ట్విస్టులు, టర్న్‌లు, అడ్రినల్ రష్ మూమెంట్స్ ప్రేక్షకులని ఎక్సయిట్ చేశాయి. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది.
‘లెవన్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. దీని కోసం ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. అలాగే తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరించాం. నాకు ఎనిమిది భాషలు వచ్చు కనుక తమిళంలోనూ నేనే డబ్బింగ్ చెప్పాను. ఇది డైరెక్టర్స్ ఫిల్మ్. టెక్నికల్‌గా లోకేశ్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూశాక రైటింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్ మూవీలోనూ రాని ఓ డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఇందులో ఉంది. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది.. సెకండ్ హాఫ్ ఆశ్చర్యపరుస్తుంది. ట్విస్టులను డీకోడ్ చేయడం కష్టం. స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులోని ప్రతి అంశానికి లాజిక్ ఉంటుంది. ఇక ప్రస్తుతం ‘మాస్ జాతర’లో విలన్‌గా నటిస్తున్నాను. ఇందులో నా లుక్, నటన వెరైటీగా ఉంటాయి. రవితేజ గారే నన్ను ఈ పాత్రకు రిఫర్ చేశారు.
కరుణ కుమార్ డైరెక్షన్‌లో ‘హనీ’ అనే సినిమా చేస్తున్నా. ఇదొక డార్క్ హారర్ మూవీ. చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ‘కాళీ’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నా. మరో తమిళ సినిమా జరుగుతోంది. మరోవైపు హరి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. నా కెరీర్‌లోనే ఇది ఫస్ట్ కామెడీ సినిమా కానుంది. ఇందులో సునీల్ గారితో కలిసి నటిస్తున్నా. నా ప్రతి సినిమాకి పదిమందైనా కొత్త ప్రేక్షకులు పెరగాలనే ఉద్దేశంతో రకరకాల పాత్రలు పోషిస్తున్నాను.’’