ఇలా కూడా జరిగిందా : రైలులోని స్లీపర్ బెర్త్.. కింద వ్యక్తిపై పడి మృతి

ఇలా కూడా జరిగిందా : రైలులోని స్లీపర్ బెర్త్.. కింద వ్యక్తిపై పడి మృతి

అదృష్టం బాగోలేకపోతే అరటిపండు తిన్నా పళ్ళూడుతాయంటారు.. ఇప్పుడు చెప్పే సంఘటనకు కరెక్ట్ ఈ సామెత సిక్ అవుతుంది.  రైలులో లాంగ్ జర్నీ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది బెర్త్ రిజర్వేషన్.. పడుకుని వెళ్లొచ్చు అనుకుంటారు. ఇప్పటి వరకు దాదాపుగా ఇలాంటి ప్రమాదం అయితే ఎక్కడా జరగలేదు.. లేటెస్ట్ గా రైలులోని స్లీపర్ బెర్త్ విరిగి.. కింద బెర్త్ పై పడటంతో.. ఓ ప్రయాణికుడు చనిపోయిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా వరంగల్ జిల్లాలో జరగటం విశేషం.. పూర్తి వివరాల్లోకి వెళితే...

కేరళలోని పొన్నానికి చెందిన అలీఖాన్ (62) మిలినియం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో జూన్ 25న ఢిల్లీకి వెళ్తున్నాడు. ఆరోజు రాత్రి వరంగల్ దగ్గరకు రాగా అలీఖాన్ తన స్లీపర్ బెర్త్ లో పడుకున్నాడు. ఆయన పైన ఉన్న మరో వ్యక్తి బెర్త్ ఒక్కసారిగా ఊడిపోయి అలీఖాన్ పై పడింది. ఈ ఘటనలో అలీఖాన్ మెడలోని మూడు ఎముకలు విరిగిపోయి మూర్చకు గురైయ్యాడు. వెంటనే ఆయన్ని వరంగల్ హాస్పిటల్ కు తరలించారు. అలీఖాన్ మెడ చుట్టూ మూడు సర్జరీలు చేశారు. అయినా అతని  ప్రాణాలు దక్కలేదు. పొన్నానిలోని ఆయన స్వగ్రామనికి అలీఖాన్ మృతదేహాన్ని పంపించారు. ఈ విషాద ఘటనపై ఇండియన్ రైల్వేస్ ఇంకా స్పందించలేదు. కనీసం బెర్త్ ఊడిపడటానికి గల కారణాలు కూడా తెలపలేదు.