62 వేల మంది మహిళా స్టూడెంట్లకు ట్రెయినింగ్‌

62 వేల మంది మహిళా స్టూడెంట్లకు ట్రెయినింగ్‌
  • 62 వేల మంది మహిళలకు ట్రెయినింగ్‌
  • ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌, సాప్‌
  • ఇందుకోసం టెక్‌సాక్షమ్‌ ప్రోగ్రామ్‌

బెంగళూరు: టెక్నాలజీలు పెద్దగా తెలియని మహిళా స్టూడెంట్లకు వాటిని నేర్పించడానికి మైక్రోసాఫ్ట్‌, శాప్‌ కంపెనీలు గురువారం ‘సాక్షమ్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాయి. టెక్నాలజీ స్కిల్స్‌ నేర్పించి వారి కెరీర్‌ డెవెలప్‌మెంట్‌కు సాయపడటం కోసమే ఈ ప్రయత్నమని తెలిపాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, వెబ్‌డిజైన్‌, డిజిటల్ మార్కెటింగ్‌లో 62 వేల మందికి ట్రెయినింగ్‌ ఇస్తారు. ఏఐసీటీఈ ట్రెయినింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ (అటల్‌) అకాడమీ, స్టేట్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌ డిపార్ట్​మెంట్లతో ఒప్పందం కుదుర్చుకొని 1,500 మంది టీచర్లకు కూడా ట్రెయినింగ్‌ ఇస్తారు. ఒక టీచర్‌ ఏడాదిలో కనీసం 50 మందికి డిజిటల్​ స్కిల్స్​లో ట్రెయినింగ్‌ ఇవ్వాలి.