వర్షాల ఎఫెక్ట్​: రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

వర్షాల ఎఫెక్ట్​: రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా  కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరంగల్​ ఖాజీపేట రైల్వే స్టేషన్​లో ప్లాట్​ఫాం ఎత్తు వరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  వరదల కారణంగా పలు మార్గాల్లో రైళ్ళు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహమూబ్​నగర్​ జిల్లా హసన్​పర్తి, కాజీపేట మార్గంలో నడిచే రైళ్లలో మూడింటిని పూర్తిగా.. నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 10 రైళ్లను దారి మళ్లించింది. 

రద్దయిన రైళ్లివే..

సికింద్రాబాద్ - – సిర్‌పూర్ – కాగజ్ నగర్ - 17233
సిర్‌పూర్ – కాగజ్‌నగర్ – - సికింద్రాబాద్ - 17012
సిర్‌పూర్ – కాగజ్‌నగర్ - – సికింద్రాబాద్ - 17234  

దారి మళ్లించిన రైళ్లు..

కోబ్రా – కొచ్చువెళ్లి 22647
ఢిల్లీ ‌‌–  హైదరాబాద్​ 12724
హెచ్.నిజాముద్దీన్​– బెంగళూరు 22692
నిజాముద్దీన్​– విశాఖపట్నం 20806
ధనపూర్​– సికింద్రాబాద్​12792
అహ్మదాబాద్​– చెన్నై సెంట్రల్​12655
శ్రీ వైష్ణో దేవి కట్రా – చెన్నై 16032
ఢిల్లీ –  తిరువనంతపురం – 12626
ఢిల్లీ – ఎంజీఆర్​– సెంట్రల్​ చెన్నై 12622
జైపుర్​– మైసూర్​12976

పాక్షికంగా రద్దయిన రైళ్లు...

తిరుపతి – -కరీంనగర్ -12761
కరీంనగర్ – -తిరుపతి -12762,
సికింద్రాబాద్ - – సిర్‌పూర్ – కాగజ్‌నగర్ -12757
సిర్‌పూర్ – కాగజ్‌నగర్ -– సికింద్రాబాద్ -12758