- బస్తర్ దండకారణ్యంలోని జేగురుగొండ పరీక్షా కేంద్రంలో 36 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు
భద్రాచలం,వెలుగు: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దండకారణ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రశ్నపత్రాలను హెలికాప్టర్ లో పంపించింది. గతంలో సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో చదివే టెన్త్, ఇంటర్ స్టూడెంట్లు జిల్లా కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి ఉండి పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఏటా ఇదే తంతు. ఈసారి ఈ మూడు జిల్లాలోని 36 మంది విద్యార్థుల కోసం జేగురుగొండలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్వశ్చన్ పేపర్లను హెలికాప్టర్ లో పంపారు.
సుక్మా జిల్లా కేంద్రం నుంచి అత్యంత మారుమూల ప్రాంతంలో 94 కి.మీల దూరంలో అడవిలోకి హెలికాప్టర్ సాయంతో ప్రశ్నపత్రాలు తరలించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
