
మాదక ద్రవ్యాల తరలింపు కోసం స్మగ్లర్లు తమ ట్యాలెంటు ఉపయోగించి చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 26) క్రికెట్ బ్యాట్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను వైజాగ్ లో పట్టుకున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు. విశాఖ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు.
పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ కు చెందిన ఖతున్, ఒడిశాకు చెందిన నాయక్ తో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. 18 బ్యాట్లలో రూ.90 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
గతంలో పోలీసులకు డౌట్ రాకుండా చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతూ ఆశ్చర్యానికి గురిచేశారు దుండగులు. జులై 05 తేదీన షాద్ నగర్ లో గంజాయి చాక్లెట్లతో పాటు.. గంజాయి పొట్లాలతో పట్టబడ్డారు. స్కూళ్లు, కాలేజీల దగ్గర చాక్లెట్లు అమ్ముతుండంటంతో పట్టుబడ్డారు. ఇప్పుడు ఏకంగా క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలించడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. డౌట్ రాకుండా ఈ ప్లాన్ చేశారు దుండగులు.