IPO News:ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో ఐపీవో క్రాష్.. మీరూ బెట్ వేస్తున్నారా..?

IPO News:ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో ఐపీవో క్రాష్.. మీరూ బెట్ వేస్తున్నారా..?

Travel Food Services IPO: ఇటీవలి కాలంలో వస్తున్న ఐపీవోల్లో అడపాదడపా కొన్నింటిని మినహాయిస్తే చాలా వరకు మంచి లాభాలను కురిపిస్తున్నాయి. అందుకే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీలతో పాటు వీటిలో డబ్బు పెట్టేందుకు రావటంతో అనేక రెట్లు ఐపీవోలు ఓవర్ సబ్ స్క్రిప్షన్ అవుతున్నాయి. మెుత్తానికి ఐపీవోలకు భారత స్టాక్ మార్కెట్లలో భారీగా డిమాండ్ కనిపిస్తోంది. 

మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి రూ.2వేల కోట్లు సమీకరించటానికి వస్తోంది. అయితే ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వస్తోందని వెల్లడైంది. ఇందుకోసం కంపెనీ కోటి 82 లక్షల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జూలై 7 నుంచి జూలై 9 వరకు అందుబాటులో ఉంటుండగా.. ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.599 కోట్లను కూడా సమీకరించింది.

కంపెనీ ఐపీవో కోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1045 నుంచి రూ.1100గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 13 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.13వేల 585 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు 40వేల160 షేర్లను రూ.104 డిస్కౌంట్ రేటుకు అందుబాటులో ఉంచింది. 

గ్రేమార్కెట్లో పరిస్థితి..
ఇన్వెస్టింగ్.కామ్ ప్రకారం కంపెనీ షేర్లు ఐపీవోకి తెరుచుకుంటున్న రోజునే ఒక్కోటి రూ.30 వద్ద ఉంది. వాస్తవానికి ఇది శనివారం షేరుకు రూ.50గా ఉంది. శుక్రవారం రూ.80 ప్రీమియం పలికింది. గురువారం రూ.92 షేరుకు ప్రీమియం ఉంది. అంటే రోజురోజుకూ ప్రీమియం తగ్గిపోవటం ఇన్వెస్టర్లను కొంత కలవరానికి గురిచేస్తోంది. గ్రేమార్కె్ట్లలో తగ్గుతున్న లాభాల ట్రెండ్ మెుదటిరోజే షాక్ కి గురిచేస్తోంది. 

కంపెనీ వ్యాపారం..
ఈ కంపెనీ ఎయిర్ పోర్టుల్లోని లాంజ్ వ్యాపారంలో ఉంది. ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ లిమిటెడ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియన్ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను నుడుపుతోంది. అలాగే దేశంలోని 9 హైవేలపై క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అలాగే కంపెనీ తన సేవలను అందించేందుకు సొంత బ్రాండ్లతో పాటు అనేక భాగస్వామి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కంపెనీ దేశంలోని దిల్లీ, ముంబై, హైదరాబాద్, కలకత్తా, చెన్నై, బెంగళూరు సహా మలేషియా వంటి విమానాశ్రయాల్లో లాంజ్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను ప్రస్తుతం నిర్వహిస్తోంది.